అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రతి సంవత్సరం క్రికెట్ లో కొన్ని కొత్త రూల్స్ తీసుకు వస్తూ ఉంటుంది. ఆ రూల్స్ ను ప్రతి టీము, ప్రతి ప్లేయర్ పాటించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా ఆట ఆడాల్సి ఉంటుంది.
అయితే ఈ ఏడాది డిసెంబర్ నుండి మెన్స్ వండే, టీ20 క్రికెట్ లో కొత్త రూల్ ప్రవేశపెట్టనుంది. అదే స్టాప్ క్లాక్ పేరుతో ఉండే కొత్త నిబంధన. ఈ నిబంధనను వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఐసిసి వెల్లడించింది. అసలు స్టాఫ్ క్లాక్ నిబంధన అంటే ఏమిటంటే ఓవర్ కు ఓవర్ కు మధ్య 60 సెకండ్ల నిర్దిష్ట సమయాన్ని గ్యాప్ టైమ్ గా ఫిక్స్ చేసింది.
బౌలింగ్ జట్టు ఈ సమయంలోపే మరుసటి ఓవర్ వేసేందుకు బౌలర్ ను దించాలి. రెండుసార్లు నిర్దిష్ట వ్యవధి దాటితే మన్నిస్తారు, మూడోసారి ఆలస్యం అయితే మాత్రం బౌలింగ్ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీగా విధిస్తారు. ఈ పరుగులు బ్యాటింగ్ టీమ్ స్కోర్ కి యాడ్ అవుతాయి. ఫీల్డ్ ఎంపైర్లు స్టాప్ క్లాక్ తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు. అహ్మదాబాద్ లో నిన్న జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో స్టాప్ క్లాక్ నిబంధన అమలుపై నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం బౌలింగ్ వేసే జట్టు ఓవర్ కి ఓవర్ కి మధ్య కాస్త సమయాన్ని వెచ్చిస్తుంది.
బౌలర్ తో మాట్లాడటం, ఫీల్డింగ్ సెట్ చేయడం లేదా బౌలర్ మార్పు ఇలా కొంత సమయం వృధా అవుతుంది.ఇలా కొత్త నిబంధన తీసుకువస్తే సమయం వృధా అవ్వడం తగ్గుతుందని ఐసిసి భావిస్తుంది. అయితే ఈ నిబంధనను ప్రయోగాత్మకంగా ఏప్రిల్ వరకు అమలు చేసి విజయవంతం అయితే దీన్ని పూర్తిస్థాయిలో కొనసాగిస్తారు.
ఒకవేళ ఇది విఫలం అయితే మాత్రం ఐసిసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుంది. గతంలో ఐసీసీ తీసుకున్న చాలా నిర్ణయాలు ఫెయిల్ అవ్వడం కారణంగా వెనక్కి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ కొత్త నిబంధన అమలులోకి వచ్చాక బౌలింగ్ జట్టు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పెనాల్టీగా ఐదు పరుగులు ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read:కప్ గెలిచాక కూడా ఆస్ట్రేలియా మీడియా భారత్ మీద ఇంత ఈర్ష్య ఎందుకు పడుతున్నారు..?