అక్కినేని అఖిల్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం లో వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ‘. చాల కాలంగా ఒక పెద్ద హిట్ సినిమా కోసం ట్రై చేస్తున్న అక్కినేని అఖిల్ ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఫ్యామిలీ, లవ్, ఎంటర్టైన్మెంట్ కి తెరకెక్కించడం లో తన దైన శైలి ముద్ర వేసుకున్న దర్శకులు ‘బొమ్మరిల్లు భాస్కర్’ కి కూడా ఒక హిట్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఇక ఈ సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందికి తీసుకురానున్నారు నిర్మాతలు. ఈ సినిమా టీజర్ ని ఇప్పటికే విడుదల చేసిన చిత్ర యూనిట్. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకుంది.
ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి మరో ప్లస్ పూజ హెగ్డే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న పూజ సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తుందనే అనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా లోని పాటలు ప్రేక్షకులని అలరిస్తున్నాయి. 100 పర్సెంట్ లవ్, గీత గోవిందం వంటి విజయవంతమైన సినిమాలని నిర్మించిన బన్నీ వాస్ ఈ సినిమా కి నిర్మాత.