IND Vs NZ 2nd ODI: భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా న్యూజిలాండ్ తో రెండో వన్డే ఆడే భారత జట్టు ఎంపికను తప్పుబట్టాడు. అసలు మేనేజ్మెంట్ ఏం ఆలోచించి, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో నాకైతే అర్దం కావడం లేదని, ఆటగాళ్లు ఒక్క మ్యాచ్‌లో విఫలమైనందుకు వారిని ఎంపిక చేయకపోవడం కరెక్ట్ కాదని విమర్శించాడు.
మేనేజ్మెంట్ తమ నిర్ణయాలతో భారత జట్టును భ్రష్టు పట్టించకండి అంటూ విమర్శించాడు. అయితే న్యూజిలాండ్ తో తొలివన్డేలో ఆడిన సంజూ శాంసన్ ను, శార్దూల్ ఠాకూర్లను రెండో మ్యాచ్‌లో తీసుకోలేదు. సంజూ శాంసన్ బదులుగా దీపక్ చహర్ జట్టులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక మ్యాచ్ బ్రాడ్‌కాస్టర్ పాల్గొన్న నెహ్రా ఈ వ్యాఖ్యలను చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టులో 2 మార్పులు చేసారు.
బౌలింగ్ ఆప్షన్‌గా దీపక్ హుడాను తీసుకున్నారని అయితే అనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. దీపక్ హుడాను 6వ బౌలింగ్ ఆప్షన్ గా తీసుకున్నారని అ నుకుంటున్నా, అతను అయితే గొప్ప ఆల్‌రౌండర్ కాదు. అతనికంటే కూడా దీపక్ చహర్ బాగా బౌలింగ్ చేయగలడు. కానీ, తొలిమ్యాచ్‌లో దీపక్ చహర్‌ను కాకుండా శార్దూల్ ఠాకూర్ ను తీసుకున్నారు. నెక్స్ట్ మ్యాచ్‌కే ఠాకూర్‌ను పక్కన పెట్టారు. ఇది సరి అయిన పద్దతి కాదు అని నెహ్రా తెలిపారు
నెహ్రా ఆ తరువాత సంజూ శాంసన్ పై గురించి నేను ఒకవేళ సెలక్టర్ ను అయి ఉంటే మాత్రం సంజూ శాంసన్ ను పక్కన పెట్టి, హుడానే తీసుకునేవాడినని చెప్పారు. అయితే ఇదే చర్చలో పాల్గొన్న మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ వాస్తవానికి సంజూ శాంసన్ గురించి చెప్తూ,అతను కొద్ది కాలంగా బాగా అడుతున్నప్పటికి ఎందుకో అతనికి ఎక్కువ అవకాశాలు రావట్లేదు. తాజాగా ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత పక్కన పెట్టారు అని సంజూకు అండగా నిలబడ్డాడు. మరోవైపు సోషల్ మీడియాలో సంజూశాంసన్ ను వివక్షపూరితంగానే రెండో వన్డేలో తీసుకోలేదంటూ ఫ్యాన్స్ బీసీసీఐని ట్రోల్ చేస్తున్నారు.