విరాట్ కోహ్లీ టాప్ క్రికెట్ దిగ్గజాలలో ఒకరి గా పేరు పొందిన ఆటగాడు. కోహ్లీ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాలలో మంచి పేరు సంపాదించుకున్న ప్లేయర్. కానీ ఆయన ఐపీఎల్ సీజన్ లో చాలా పేలవమైన ఆట ఆడుతూ ఫ్యాన్స్ నీ నిరాశపరుస్తూ వస్తున్నారు.
చాలా మంది అభిమానులు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫామ్ కోల్పోయాడని అంటున్నారు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు పదకొండు మ్యాచ్ లు ఆడి 216 పరుగులు మాత్రమే చేశాడు..
అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 3 డక్ ఔట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో రెండు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పైనే ఉన్నాయి. ఆయన మూడు గోల్డెన్ డక్కులు, మూడు సింగిల్ డిజిట్ స్కోర్ నమోదు చేసి ఈ సీజన్ లో చాలా పేలవంగా ఆడారని అభిమానులు అంటున్నారు. అయితే ఈ డకౌట్ల తర్వాత విరాట్ కోహ్లీ ఆటతీరుపై ట్విట్టర్లో చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఈయన తన ఆట తీరును చూస్తే రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్ వదులుకునే అవకాశముందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే ఆర్సీబీ ఇన్సైడర్ తో విరాట్ కోహ్లీ తాజా ఇంటర్వ్యూలో డకౌట్ ల తర్వాత ఎలా అనిపించిందో తెలియజేశాడు. కోహ్లిని నాగు ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన చాలా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.. నాగు నీకు పెట్స్ అంటే చాలా ఇష్టమా అని అడిగాడు. దీంతో కోహ్లీ నాకు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం అని కానీ వాటిని పెంచితే చూసుకోవడానికి సరైన సమయం లేదని అన్నారు. దీంతో నాగు నవ్వుతూ మిమ్మల్ని మైదానంలో రెండుసార్లు డక్ లతో చూశానని అన్నారు.
దీంతో కోహ్లీ తల కిందికి వేసుకొని నవ్వుతూ నా కెరీర్ లో ఇలా ఎప్పుడూ జరగలేదు అన్నాడు. ఈ విధంగా ఇంటర్వ్యూ సాగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ కూర్చున్న చిన్నపిల్లల కుర్చీ వెనక భాగం విరిగిపోయింది. దీంతో అక్కడ వారు నవ్వుతూ, మళ్లీ కోహ్లీ లేచి ఆ కూర్చిని సరిచేసుకుని కూర్చున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్లు చేస్తూ నవ్వుకుంటున్నారు.
https://www.instagram.com/tv/CdaGAwEJjic/?igshid=YmMyMTA2M2Y=