దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భార్య ప్రముఖ మహిళా వ్యాపారవేత్త నీతా అంబానీ గురించి అందరికీ తెలిసిందే. ఆమె గురించి పనిగట్టుకుని చెప్పాల్సిన అవసరం లేదు. నీతా అంబానీ నవంబరు ఒకటో తారీఖున 60 వసంతంలోకి అడుగుపెట్టారు. నీతా అంబానీ తన బర్త్ డే ను ముంబైలోని నిరుపేద పిల్లలతో జరుపుకోవడం విశేషం.
బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని అన్న సేవలో మూడు వేల మంది నిరుపేద పిల్లలకు భోజనం పెట్టారు. వారితో కలిసి కేక్ కట్ చేసి బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 1.4 లక్షల మందికి అన్న సేవ నిర్వహించారు. దేశంలోని 15 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీలకు వేడివేడి భోజనం అందించారు.
కొందరికి రేషన్ కిట్లు కూడా పంపిణీ చేశారు. నిరుపేదలతో నీతా అంబానీ బర్త్ డే వేడుకలు జరుపుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నీతా అంబానీది ఎంత గొప్ప మనసు అంటు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అత్యంత సంపన్నురాలై ఇలా పేద పిల్లలతో బర్త్ డే జరుపుకోవడం ఆమె మంచి మనసుకు నిదర్శనం అని అంటున్నారు.నీతా అంబానీ ముంబైలోని అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్కు చైర్ పర్సన్ గా ఉన్నారు. అలాగే ఐపీఎల్ జట్టు అయిన ముంబై ఇండియన్స్ కు ఆమె కో ఫౌండర్.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళ కూడా ఈమె. అంబానీని 1985లో పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులు అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ కుమార్తె ఇషా ఉన్నారు.అంబానీ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా తమ కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ముందుగా పేద పిల్లలకి సేవ చేస్తూ ఉంటారు. తమ కుమారులు కుమార్తె పిల్లలకు కూడా ముందుగా అనాధాశ్రమంలో పిల్లలకి వృద్ధులకి భోజనాలు పెట్టించి బట్టలు కూడా అందించారు. ఎంత సంపన్నులైనప్పటికీ ఇటువంటి మంచి మనసు కలిగి ఉండడం నిజంగా గ్రేట్ అని నెటిజెన్లు అంటున్నారు.
Also Read:ఛీఛీ… ఇడ్లీని నాశనం చేశారు..! దీన్ని ఎలా తింటారో..?