మేష రాశి: వ్యాపార అభివృద్ధికి చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. కొంత మేర అనారోగ్య సమస్యలు వెంటాడే సూచనలు ఉన్నాయి. ఉద్యోగాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ఉన్నత అధికారుల మెప్పు నేటి రాశి ఫలాలు పొందుతారు. మీతోటి పనివారితో, ఆడవారితో చికాకులు తప్పవు. గతంలోని కొన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు.
వృషభ రాశి: కొత్త రుణాల కోసం అన్వేషణ, ఫర్టిలైజర్, విత్తన వ్యాపారస్తులకు అనుకూలం, వాడిన వస్తువులు కొని ఇబ్బందులు పడతారు, ఉపాధ్యాయులకు ఉన్నత స్థానం. మీడియా రంగం వారికి అనుకోని సమస్యలు.
మిథునం: ఉద్యోగస్తులకు ఒత్తిడి తప్పదు. భాగస్వామిక ఒప్పందాల్లో పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ నిర్ణయాలని గట్టిగా చెప్పే ప్రయత్నం చెయ్యండి. మీ సన్నిహితులకు, బంధుమిత్రులకు ధన సహాయం మంచిది కాదు. నగదు లావాదేవీలు చాల జాగ్రత్తగా చెయ్యడం లేదా గోప్యంగా చెయ్యడం ఉత్తమం.
కర్కాటకం : నిరుద్యోగులు మరింత మనోధైర్యంతో ముందడుగు వెయ్యడం మంచిది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా కోలుకుంటారు, వ్యాపార అభివృద్ధి కొరకు స్థల మార్పిడి మంచిది. ఈ రోజు రాశి ఫలాలు 2021 కొన్ని విషయాల్లో పక్క వారి మీద ఆధారపడకపోవడం మంచిది. బ్యాంకు పనుల్లో పూర్తి మెలకువ చాల అవసరం.
సింహం: మీరు చేసే చిన్న చిన్న మాటలు కూడా పూర్తి వివాదాస్పదం అవుతాయి. నూతన వదువరులు ప్రేమ అభిమానాలతో మెలుగుతారు. అధిక ఖర్చులు తప్పవు. వ్యాపార వర్గాల వారికి పర్వాలేదు. మీ కుటుంబం లో చిన్న చిన్న సమస్యలు చికాకులు ఎదురైనా తిరిగి పరిష్కరించుకుంటారు.
కన్య రాశి : అధిక ఖర్చులు, సున్నితమైన నిర్ణయాల్లో మీ జీవిత భాగస్వామి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. డబ్బు పొదుపు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. రుణాల కోసం ఇతరుల సహాయం కొరకపోవడమే మంచిది.
తులా రాశి: ఎవరైతే ఇంటి నిర్మాణ రంగం లో వ్యాపారాలు కొనసాగిస్తున్నారో వారికి పూర్తి అనుకూలం. మీరు చేపట్టిన పనుల్లో జాప్యం. వృత్తి ఉద్యోగస్తులకు పూర్తి అనుకూలం. ఆడవారికి వారి చుట్టూ ప్రక్కన ఉన్నవారితో కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి.
వృశ్చిక రాశి: మీ నిస్వార్థ సలహాలు,సూచనలు వలన మరింత పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. మీ బంధువులతో నెలకొన్న సమస్యలు తీరుతాయి. ఆస్తుల విషయాల్లో పెద్దలతో సంప్రదిస్తారు. విద్యార్థులు వాహనాలు నడుపుతున్నపుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ధనుస్సు రాశి: నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనల పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు మరింత బరువు బాధ్యతలు అధికం. పత్తి, పొగాకు వ్యాపారం చేసే వారికి ఇది పూర్తిగా అనుకూలించే రోజు. ఎవరైతే అద్దె ఇంటి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి.
మకరం రాశి: ప్రేమ వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు మరి కొంత కృషి చేస్తే తప్పక ఫలిస్తారు. మెడికల్ వ్యాపారస్తులకు పూర్తి అనుకూలం. మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు చికాకు కలిగిస్తుంది. ఇవాళ ప్రయాణాలకు దూరంగా ఉండటమే మంచిది. సాహసోపేతమైన వ్యవహారాలకు దూరంగా ఉండటం ఉత్తమం.
కుంభం: మీ శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. మీ జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాల సందర్శన, హోటల్ రంగాల వారికి పనివారితో చికాకులు తప్పవు, మీ తోటి వారికి సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా మరొకరికి మీరు శత్రువులవుతారు.
మీనం రాశి: కిరణం వ్యాపారస్తులకు, వ్యాపారవర్గాల వారికి పూర్తి అనుకూలం. ఆడిటర్లకి పనిలో ఒత్తిడి, భారం తగ్గించుకుంటారు. మీ ఇంటికి కావలసిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రాజకీయ రంగాల వారికి ఒత్తిడి తప్పవు.
ఇవి కూడా చదవండి: