నిహారిక భర్త పైన పోలీసులకి ఫిర్యాదు చేసిన అపార్ట్మెంట్ సభ్యులు..! అసలేమైందంటే ! మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కి ఇటీవలే వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఆమె వారిద్దరిని వివాహం అనంతరం ఎంత సంతోషంగా ఉన్నారో తెలియచేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పోస్ట్స్ షేర్ చేస్తూ ఉంటారు కూడా.
ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం.. అనుకోని సంఘటనల వలన గత రాత్రి నిహారిక భర్త పైన పోలీసులకి ఫిర్యాదు చేసారు అపార్ట్మెంట్ లో నివసిస్తున్నవారు. వివరాల్లోకి వెళితే నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య కి అపార్ట్మెంట్ సభ్యుల మధ్య తీవ్రంగా గొడవ జరిగి కంప్లైంట్ ఇచ్చే వరకు వెళ్లిందని తెలిసింది. నిహారిక భర్త రచ్చ చేస్తున్నాడని.. వారు ఫిర్యాదు చేయగా చైతన్య కూడా తిరిగి అపార్ట్ మెంట్ సభ్యుల పై ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టనున్నారు.