తల్లిదండ్రులు తమ పిల్లల్ని చిన్నప్పటినుండి అల్లారం ముద్దుగా సాకుతూ పెంచి పెద్ద చేస్తారు. వారికి చదువు చెప్పించి కావలసినవి కొనిచ్చి జీవితంలో స్థిరపడేంతవరకు వారికి అండగా నిలబడతారు. తర్వాత తమ పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడితే తల్లిదండ్రులు మించి ఆనందపడేవారు మరొకరు ఉండరు.
తర్వాత పిల్లలకు పెళ్లి చేయడం వారి పిల్లలు కనడం ఇలా జీవిత చక్రం తిరుగుతూ ఉంటుంది. కొంతకాలానికి తల్లిదండ్రులు వృద్ధాప్యం వస్తుంది. వారి పని వారి చేసుకోలేని పరిస్థితి వస్తుంది. సంపాదించే ఓపిక కూడా ఉండదు. మామూలుగా అయితే కొడుకులకు తమ తల్లిదండ్రులను చూసే బాధ్యత ఉంటుంది. ఒకవేళ కొడుకులు లేకపోయినా కూతుర్లు ఉన్న ఆ కూతుర్ల వద్ద నుండి తల్లితండ్రులు మెయింటెనెన్స్ కొరకు డబ్బులు ఆశించవచ్చా…? రూల్స్ ఏమి చెబుతున్నాయి. పూర్తి వివరాలు మీకోసం.
మనదేశంలో ఉన్న హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ 1956 ఆక్ట్ ప్రకారంగా అలాగే కీర్తి కాంత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ అనే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉత్తమ బాగోగులు తాము చూసుకోలేని స్థితిలో ఉన్న, తమకి సంపాదించుకునే శక్తి లేకపోయినా వారి కనీస అవసరాల కోసం కొడుకు నుండి ఏ విధంగా ఆశించే హక్కు ఉంటుందో అలాగే పెళ్లైన కుమార్తెనుండి కూడా అదే విధంగా ఆశించే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
హిందూ సక్సెషన్ ఆక్ట్ ప్రకారం కూతుర్లు తల్లిదండ్రుల ఆస్తిలో వాటా కావాలని ఎలా కోరుతున్నారో అదేవిధంగా తల్లిదండ్రుల వయోవృద్ధ సమయంలో వారి కనీస అవసరాలు తీర్చే బాధ్యత కూతుర్లు కలిగి ఉంటారని సుప్రీంకోర్టు చెబుతుంది. అలాగే తల్లిదండ్రుల వద్ద ఆస్తులు తీసుకుని వారిని సరిగ్గా చూడకుండా ఇంట్లోనే ఉంటూ వారిని ఇబ్బందులకు గురి చేస్తే పిల్లల వద్ద వారి ఆస్తిని తిరిగి తీసుకుని, పిల్లలను ఇంటి నుండి బయటకు పంపే వేసే హక్కు కూడా తల్లిదండ్రులు కలిగి ఉంటారని చెబుతుంది.
ఈ విషయం ప్రకారం చూస్తే కుమారుడు కానీ కుమార్తె గాని తమ తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవాల్సిన హక్కును కలిగి ఉంటారు. కేసుల విషయము కోట్లు విషయం పక్కనబెడితే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మనకు ఉంటుంది.
Also Read:మీ భార్యలో ఈ మార్పులు గమనిస్తున్నారా.? ప్రతి భర్త తప్పక చదవాల్సిన విషయం ఇది.!