మహేష్ బాబు సినిమాలు అంటేనే ఎప్పుడు సక్సెస్ అనే బ్రాండ్ ఆయనకు ఉంది. ఆయన సినీ జీవితంలో డిజాస్టర్ అయినా మూవీ బ్రహ్మోత్సవం మాత్రమే.. ఆ సినిమా సీరియల్ ను తలపిస్తుంది అని నెటిజన్ల నుండి కామెంట్లు వచ్చాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన సర్కారు వారి పాట సినిమా రెండవ భాగం కూడా బ్రహ్మోత్సవం సినిమా లాగానే ఉందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో మహేష్ అభిమానులకు కాస్త నిరాశ ఎదురైంది అని చెప్పవచ్చు. ఆయన అభిమానులు ఈ మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నారు.. రెండున్నర సంవత్సరాల తర్వాత ఆయన నుండి వచ్చిన ఈ సినిమా ఈ విధంగా నిరాశ పరచడం అభిమానులను బాధిస్తోందని అంటున్నారు.. మూవీ పై ఎన్నో అంచనాలు పెట్టుకొని సినిమా చూడడానికి వెళ్తే ఏ మాత్రం ఆకట్టుకోలేదని ఫ్యాన్స్ అంటున్నారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో మంచి అవకాశం ఇస్తే దర్శకుడు పరశురామ్ ఉపయోగించుకో లేదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కథల విషయంలో ఆచితూచి అడుగు వేసే మహేష్ బాబు ఈ సర్కారు వారి పాట సినిమా ఓకే చేసి తప్పు చేశాడని మరి కొందరు భావిస్తున్నారు. ఈ సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతలు సైతం అంచనాలకు మించి నష్టాలు మిగులుతాయనే సంగతి తెలిసిందే..అయితే ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం డిస్ట్రిబ్యూటర్ లను కలవరపెడుతోంది. అయితే సినిమా థియేటర్లో రిలీజ్ అయి వారం రోజులకే ఓటీటీ లోకి అందుబాటులోకి రావడంతో చాలా మంది థియేటర్ లోకి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదని చెప్పవచ్చు. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో అని ఆయా హీరోల ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.