రాఘవేందర్ రావు గారి “పెళ్లి సందడి” ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. “సౌందర్య లహరి” అనే పాట ఇప్పటికి జబర్దస్త్ లాంటి షోస్ లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. శ్రీకాంత్ కి మంచి హిట్ అందించిన రాఘవేందర్ రావు గారు ఇప్పుడు శ్రీకాంత్ కొడుకు “రోషన్” కి మరో హిట్ అందివ్వనున్నారు. రాఘవేందర్ రావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్లి సందడి సీక్వెల్ విజయదశమికి ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
ట్రైలర్స్, సాంగ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. శ్రీకాంత్ వారసుడుపై ప్రశంసలు కురిసిపిస్తున్నారు ఫాన్స్. ఈ ట్రైలర్, సాంగ్స్ చూసి ఆ హీరోయిన్ కి కూడా చాలామంది ఫిదా అయ్యారు. ఆమె ఎవరా తెలుసుకోవాలి అని సెర్చ్ చేస్తున్నారు ఫాన్స్. ఆ హీరోయిన్ పేరు “శ్రీలీల”. ఆమె పుట్టినిల్లు కర్ణాటక. కన్నడ ఆమె మాతృబాష ఇప్పటికే పలు కన్నడ చిత్రాలలో నటించిన శ్రీలీల… టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుండగా..ఈ సినిమా ఆఫర్ వచ్చింది. ఇక ఆమె సంతోషానికి హద్దులు లేవు..
సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల ని ఆయనే ఎంపిక చేసారు. ప్రస్తుతం ఆమెకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ముఖ్యంగా పాటలు విడుదలైనప్పటినుండి ఆడియన్స్ ఆమె ఫోటోలు సెర్చ్ చేయడం, ఆమె ఎవరో తెలుసుకోవాలి అనేదానిపై ఆసక్తి చూపారు. రాఘవేంద్ర రావు గారు పరిచయం చేసిన ఎంతో మంది హీరోయిన్లు సక్సెస్ అందుకున్నారు. మరి శ్రీలీల లక్ ఎలా ఉందో చూడాలి.