ప్రస్తుత కాలంలో పెళ్లంటే తప్పనిసరిగా ఫోటోలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఫోటోల అనేవి మన జీవితాంతం మనతోనే ఉంటాయి. కాబట్టి వివాహాల్లో ఏమాత్రం తగ్గకుండా ఫొటోగ్రాఫర్లను తెచ్చుకుంటున్నారు. ఇక పెళ్లి వేడుకలో ఫోటోగ్రాఫర్ల చిలిపి చేష్టలు మామూలుగా ఉండవు..
పెళ్లి తంతు జరిగేటప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో సహా వచ్చిన వారిని అంతా నవ్విస్తూ ఉంటారు.. మరి ఈ పెళ్లి తంతులో ఈ ఫోటో గ్రాఫర్ ఏం చేశాడో చూద్దాం..!!
ఈ మధ్య వివాహ వేడుకల ఫోటోలు మరియు వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. పెళ్లి కూతురు డాన్స్ లు అయితే ట్రెండింగ్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే మరొక వివాహ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వివాహ వేడుక జరుగుతూ ఉండగా ఫోటోగ్రాఫర్ చేసిన చిలిపి చేష్టలను చూసిన పెళ్లికూతురు, మరియు పెళ్లికి వచ్చిన వారంతా నవ్వుకున్నారు. మొత్తం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసే నెపంతో పూజ ప్లేట్ లో ఉన్నటువంటి డబ్బును దొంగిలించడం మనకు కనిపిస్తుంది. కానీ పక్కనే ఉన్న పెళ్లి కూతురు మాత్రం అతన్ని పసిగట్టింది. దీంతో వరుడితో వచ్చిన వారు సైతం దాన్ని చూసి నవ్వుకున్నారు. తర్వాత ఈ వీడియోను ఫోటోగ్రాఫర్ దొంగతనం చేయడం చూశారా అంటూ సోషల్ మీడియాలో క్యాప్షన్ ఇచ్చి అప్లోడ్ చేయగా చాలా వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూస్తున్న నెటిజన్లు రకరకాల రియాక్షన్స్ తో ఏమో జిలతో కామెంట్లు చేస్తున్నారు.
https://www.instagram.com/reel/CdBCTtRqmK-/?utm_source=ig_web_button_share_sheet