ఈనెల 29వ తేదీన ఆచార్య మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ తరుణంలో మూవీ ప్రమేషన్ ఈవెంట్లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి, రామ్ చరణ్ దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్ పూజా హెగ్డే పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో చాలా చలాకీగా ఉత్సాహంగా జోకులు వేస్తూ సినిమా జర్నలిస్టులతో సరదాగా కనిపించారు మూవీ యూనిట్. ఈ క్రమంలో చిరంజీవి పూజా హెగ్డే కు ఇచ్చిన చిన్న ఝలక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సరదా సన్నివేశం ఏంటో చూద్దాం. సినిమా ప్రెస్ మీట్ లో పూజా హెగ్డే చిరంజీవి కంటే ముందే వచ్చి కూర్చుంది. దీని తర్వాత రామ్ చరణ్ చిరంజీవి కొరటాల శివ రావడంతో వెంటనే లేచి విష్ చేసి ఆమె పక్కన కూర్చో బోతే.. రామ్ చరణ్ వెంటనే వచ్చి పూజ హెగ్డే ని చిరంజీవి పక్కనే కూర్చోబెట్టారు. ఈ క్రమంలో ఆమెను వేదికపైకి పిలువగానే లేచి వెళ్లే సమయంలో పూజా హెగ్డే చీరకొంగు చిరంజీవి గారి కాలు కింద పడడంతో ఆమె అక్కడే ఆగింది.
ఇది వెంటనే గమనించిన చిరంజీవి టక్కున కాలు తీసాడు. దీంతో పూజ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ప్రెస్ మీట్ లో పూజాహెగ్డే చిరంజీవి ఒకే వేదికపై సరదాగా కనిపిస్తూ మాట్లాడింది. రామ్ చరణ్ చిరంజీవిల డాన్స్ గురించి మాట్లాడుతూ చరణ్ వాడితో చేసేటటువంటి డాన్స్ మూమెంట్స్ చాలా బాగుంటాయి కానీ చిరంజీవి గారి డాన్స్ తో పాటుగా ఎక్స్ప్రెషన్స్, చూపించే ఫీలింగ్స్ గ్రేస్ ఇంకా బాగుంటుంది..
అందరూ అన్ని పార్ట్స్ కలిపి డాన్స్ చేస్తే చిరంజీవి మాత్రం ముఖం భావాలతోనే డాన్స్ చేస్తారని పూజ చెప్పింది. ఈ సందర్భంగా వారి మధ్య రొమాంటిక్ గా మీడియా సమావేశం ముగిసింది. అనంతరం రామ్ చరణ్, చిరంజీవి, పూజాహెగ్డే కొరటాల శివ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. చిరంజీవి మరియు పూజా హెగ్డే కలిసి ఫోటో దిగాలని రిపోర్టర్లు అడగగానే చిరంజీవి చేతులు కలుపుతూ పూజను లాగే ప్రయత్నం చేశారు. దాన్ని చూసిన రామ్ చరణ్, పూజా హెగ్డే ను చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లారు.
దీంతో వేదిక పై వచ్చిన పూజా హెగ్డే కు స్వీట్ గా హాగ్ ఇచ్చి ప్రేమతో దగ్గరకు తీసుకున్నారు చిరంజీవి. దీంతో పూజ బుగ్గలు ఎరుపెక్కాయి. ఈ యొక్క రొమాంటిక్ మూమెంట్ చూడగానే అన్నయ్య మూవీలో సౌందర్య తో చేసిన సీన్ గుర్తుకొచ్చింది. చిరంజీవితో దిగిన ఫోటోలు అన్ని పూజా హెగ్డే తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. స్వీట్ అండ్ ఎవరు జోవియల్ చిరంజీవి గారే అంటూ పూజా ట్వీట్ చేసింది.