మనం నిత్యం చూసే కొందరి కళ్ళను ఇట్టే గుర్తుపట్టేయగలరు. ఆ కళ్ళకి మనల్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. మనిషి మొహం పూర్తిగా చూడకపోయినా ఆ కళ్లబట్టి ఇది పలానా వ్యక్తి అని చెప్పగలం. అలాంటి ఒక పవర్ ఫుల్ పర్సన్ కళ్ళు మీకు చూపిస్తున్నాం. ఒకసారి ట్రై చేయండి ఈ కళ్ళు ఎవరివో గుర్తుపట్టండి. మీకోసం ఒక క్లూ ఇస్తున్నాం. ఇతను తెలుగు చిత్ర సీమలో నెంబర్ వన్ హీరో. ఈ కళ్ళు ఎందరికో కళ్ళను దానం చేస్తాయి.
ఈ కళ్ళు ఈ అందరి మీద తన చల్లని చూపులను ప్రసరించాయి. ఈ కళ్ళకి కల్మషం తెలియదు. ఈపాటికి మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. ఈ కళ్ళు మన మెగాస్టార్ చిరంజీవి కళ్ళు.
మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయం అక్కరలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రారాజుగా వెలుగొందుతున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి చెయ్యని పాత్ర లేదు, చూడని స్టార్ స్టేటస్ లో లేదు. ఇండియాలోనే మొదటిసారిగా కోటి రూపాయలు పారితోషకం అందుకున్న హీరోగా రికార్డులకు ఎక్కారు.చిరంజీవి అంటే ఒక మహా వృక్షమని ఎందరికో నీడనిచ్చిందని ఇండస్ట్రీలో జనం బయట జనం చెప్పుకుంటూ ఉంటారు. ఎందరికో దానాలు చేసిన చిరంజీవి ఎప్పుడు ప్రచారాన్ని కోరుకోలేదు.ఎవరైనా సరే నటించాలి అంటే శరీరాన్ని హూనం చేసుకోవాలి. కానీ చిరంజీవికి తన కళ్ళే సరిపోతాయి.
తన హావభావాలు ప్రకటించడానికి తన కళ్ళను మించిన ఆయుధాలు చిరంజీవికి వేరేవి లేవు. చిరు కళ్ళ లోకి నేరుగా చూడాలంటే ధైర్యం సరిపోదు అని ఎందరో డైరెక్టర్ లు చెప్పారు. ఆ కళ్ళలో ఏదో మ్యాజిక్ ఉంది అంటారు. చాలా సినిమాల్లో డైలాగులు లేని చోట సీను పండించాలంటే చిరంజీవి కళ్ళు నటించేవి. ఇప్పటికీ ఆ మ్యాజిక్ మనకి వెండితెరపై కనబడుతూనే ఉంది. చిరంజీవి పాత ఫోటోలు చూసిన కొత్త ఫోటోలు చూసినా నేరుగా చూసిన కూడా మన దృష్టి అంతా ఆయన కళ్ళ మీదకి వెళుతుంది. ఆ కళ్ళు ఆయనకి భగవంతుడు ఇచ్చిన వరం.
Also Read:టైగర్ నాగేశ్వరరావు కోలుకున్నట్లేనా…? పూర్తి రిజల్ట్ ఏంటి…!