యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గాని, డాన్స్ గాని ఏ విధంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. అది అందరికీ తెలుసు.. త్రిబుల్ ఆర్ మూవీ లో ఆయన చేసిన యాక్టింగ్ చాలామందికి కన్నీళ్లు పెట్టించింది అంటే ఆయన పర్ఫామెన్స్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఈ విధంగా తన నటనతో, డాన్స్ తో పాన్ ఇండియా లెవల్లో మంచి పేరు సంపాదించారు. మూవీ బాక్సాఫీస్ వద్ద బంపర్ విజయాన్ని అందుకుంది. ఈ విధంగా పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న ఆయన ఆలస్యం చేసే ప్రసక్తే లేదు అన్నట్టుగా నెక్స్ట్ స్టెప్ వేస్తున్నారు.
కొరటాల దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో మరో సినిమా తీసేందుకు రెడీ అయిపోయాడు. ఈ విషయాన్ని కొరటాల శివ ఇప్పటికే కన్ఫామ్ చేశారు. తారక్ తో చేసే మూవీ బిగ్ స్పాన్ ఉందని కొరటాల శివ అనడంతో యంగ్ టైగర్ అభిమానులు మాత్రం ఆనందంతో ఉరకలు వేస్తున్నారు. కొరటాలతో మూవీ తర్వాత యంగ్ టైగర్ ఉప్పెన ఫెం బుచ్చిబాబుతో, దీని తర్వాత కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తారు అనే విషయం మనందరికీ తెలిసిందే.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ వారివారి భార్యలతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. ఇందులో ఎన్టీఆర్ ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆయన భార్య లిఖిత కలిసి ఉన్నారు. ఈ ఫోటోతో యంగ్ టైగర్ తన అభిమానులను మరోసారి సర్ ప్రైజ్ చేశారని చెప్పవచ్చు. అయితే మే 5వ తేదీన ప్రశాంత్ నీల్, మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల వివాహ వార్షికోత్సవాలు కాబట్టి వారు కలిసి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.
యంగ్ టైగర్ స్వయంగా ప్రశాంత్ నీల్ దంపతులకు ఆహ్వానం పలికి ఇద్దరు వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఎన్టీఆర్ షేర్ చేస్తూ ఒకే రోజు మా ఇద్దరి వివాహ వార్షికోత్సవం రావడం చాలా విశేషం.. ఇది మాకు ఒక నూతన ఆరంభమని చెప్పారు.. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా తప్పకుండా చేస్తానని కన్ఫర్మేషన్ చేసుకున్నారు.