బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఎవరి ఆట తో వారు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెర్ఫామెన్స్ లోనే కాదు గొడవల్లోనూ రెచ్చిపోతున్నారు కంటెస్టెంట్స్. సీజన్ ప్రారంభం నుంచి కూడా హౌస్ లో ప్రతి రోజు వాగ్వాదాలు, గొడవలు చూస్తూనే ఉన్నాం. తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన కొత్త టాస్క్ మరో గొడవకి దారి తీసింది.
బిగ్ బాస్ ఈవారం ఎవరి పెర్ఫామెన్స్ బాగుంది? ఎవరి పెర్ఫామెన్స్ వరస్ట్ గా ఉందొ చెప్పమన్నాడు. దీనితో ఎవరి అభిప్రాయాలను వారు చెప్పవచ్చారు. ఇక్కడే ఇద్దరి కంటెస్టెంట్ ల మధ్య భారీగా గొడవ పడిందనే చెప్పాలి. దీనితో ప్రియాంక బెస్ట్ పెర్ఫామర్ వోట్ లోబో కి వేయగా వరస్ట్ పెర్ఫామర్ గా ఉమాదేవి ఆంటీతో చెప్పింది అందరిని చిన్న చూపు చూస్తుందని, తీసిపారేసినట్లుగా మాట్లాడుతున్నారు అని చెప్పగా.
తాను ఒక్కసారిగా సీరియస్ అయ్యింది ఉమా దేవి. నన్ను చాలా పద్దతిగా పెంచారని ప్రియాంక అనగా, నన్ను కూడా చాలా పద్దతిగా పెంచారు అని ఉమా దేవి అంటుంది. చూస్తూనే ఉన్నాం ఎం పద్ధతుల్లో అంటూ రివర్స్ కౌంటర్ వేయగా. షటప్ ..షటప్ అంటూ ఇద్దరు వాగ్వాదానికి దిగారు ప్రియాంక, ఉమాదేవి. ఇది జరిగిన కాసేపటికి ఉమా దేవి వద్ద దగ్గర వచ్చి సారీ చెబుతుంది ప్రియాంక.