Pushpa 2 Movie Poster: ప్యాన్ ఇండియా సినిమా అయిన ‘పుష్ప 2: ది రూల్’ రిలీజ్ డేట్ను ఇటీవల మూవీ టీం తెలియజేసింది. సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాతో బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్న సంగతి కూడా తెలిసిందే.
దీంతో ‘పుష్ప 2: ది రూల్’ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెబుతూ చేస్తూ ఓ పోస్టర్ను కూడా మూవీ టీం విడుదల చేసింది.
అసలు కథ ఇక్కడే మొదలైంది. ఎందుకంటే ఇందులో విడుదల చేసిన పోస్టర్లో బన్నీ చేతివేళ్లను హైలెట్ చేస్తూ విడుదల చేశారు. అందులో బన్నీ చిటికిన వ్రేలుకి మాత్రమే పింక్ కలర్లో గోర్ల రంగు ఉంది. కేవలం చిటికెన వ్రేలికి మాత్రమే గోర్ల రంగు ఎందుకు పెట్టారని ఫ్యాన్స్ తెగ ఆలోచించేస్తున్నారు.
చేతులకు ఉంగరాలు, బ్రెస్ లైట్ కూడా ఉన్నాయి. కానీ ఎడమచేతికి ఉన్న పింక్ నెయిల్ పాలిష్ గురించే ప్రస్తుతం నెట్టింట ఎక్కువగా చర్చ జరుగుతుంది. అందులోనూ చిటికెన వ్రేలు కూడా బాగా పొడవుగా ఉండటంతో.. గోర్లు పెరిగే సంస్కృతి ఏదైనా ఉందా అని చాలామందిలో ఆలోచన మొదలైంది.
ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్లోనే కాకుండా ఇంతకు ముందు విడుదల చేసిన టీజర్లోనూ కూడా పింక్ కలర్ నెయిల్ను హైలెట్ చేశారు. మరి అసలు కారణం తెలియాలంటే.. సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వేచి ఉండాల్సిందే.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ చదవండి !