రాందేవ్ బాబా యోగా గురువుగా అందరికీ పరిచయమే. ఆయన బ్రాండ్ పతాంజలి ప్రొడక్ట్స్ దేశం మొత్తం మీద అన్ని చోట్ల లభిస్తూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన వ్యవహార శైలి ద్వారా ఆయన బాగా ఫేమస్ అయ్యారు.రాందేవ్ బాబా ఒక యోగా గురువుగా చూడ్డానికి చాలా సాధారణ వ్యక్తిగా కనిపించిన కూడా ఆయన ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిలినియర్ అనే సంగతి మీకు తెలుసా..? అంబానీలు టాటాలతో సమానంగా ఆయనకి ఆస్తులు ఉన్నాయని సంగతి మీకు తెలుసా..?
ఒకసారి రాందేవ్ బాబా లైఫ్ స్టైల్ ను పరిశీలిస్తే చాలా లగ్జరీగా ఉంటుంది. ఖరీదైన ఇళ్లల్లో ఉంటారు, ఖరీదైన కార్లలో తిరగడం ఆయనకి చాలా ఇష్టం.యోగా నుండి రాజకీయాలు, వ్యవసాయం నుండి ఆయుర్వేదం, టీవీ షోలు ఇలా ఒక ఇండియాలోనే కాకుండా ప్రపంచమంతా రాందేవ్ బాబా బాగా ఫేమస్. భారతదేశంలోని అత్యంత ప్రభావితమైన వ్యక్తుల్లో రాందేవ్ బాబా ఒకరు.
రాందేవ్ బాబా అసలు పేరు రామ్ కిషన్ యాదవ్, 1965 డిసెంబర్ 25న హర్యానా రాష్ట్రంలో జన్మించారు. చిన్నప్పుడు గురుకులంలో చేరి ఆచార్య బల్దేవ్ జి కర్నేశ్వర్ దగ్గర యోగా నేర్చుకున్నారు.తర్వాత సన్యాసి దీక్ష తీసుకుని స్వామి శంకర్ దేవ్ నుండి రాందేవ్ బాబాగా ఉపదేశం పొందారు. తర్వాత ఊరి జనానికి ఉచితంగా యోగ నేర్పిస్తూ యోగా ఉపయోగాలు గురించి చెప్పేవారు.1995లో దివ్య యోగ మందిర్ ను ప్రారంభించారు.2003లో ఒక టీవీ ఛానల్ లో తన యోగ క్లాసులు ప్రసారం చేసేవారు. క్రమక్రమంగా బాబా ప్రాచుర్యం పొందారు. ప్రముఖులందరూ బాబా దగ్గర యోగా నేర్చుకోవడానికి వచ్చేవారు.2006 లో ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో పతంజలి నీ ప్రారంభించారు.
ఇది ప్రపంచంలో బాగా పేరు తెచ్చుకున్న కంపెనీ గా మారింది. యోగాలో ఆయన చేసిన కృషికి గాను నాలుగు యూనివర్సిటీలు డాక్టరేట్ లు అందించాయి. పతంజలి కంపెనీ ద్వారా బాబా బిలియనీర్ గా మారారు. మొత్తంగా రాందేవ్ బాబా నికర ఆస్తులు వివరణ చూసుకుంటే 190 మిలియన్ డాలర్లు ఉంటుంది. పతాంజలి కంపెనీ మొత్తం ఆదాయం 1.6 మిలియన్ డాలర్లు. రాందేవ్ బాబా స్నేహితుడు అచార్య బాలకృష్ణ పతాంజలి కంపెనీ సీఈఓ గా ఉన్నారు. యోగ క్లాసుల ద్వారా ప్రతి సంవత్సరం 25 కోట్లు రూపాయలు సంపాదిస్తారు. రాందేవ్ బాబా బుక్స్ ,సిడి ల రూపంలో రెండు నుంచి మూడు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.ఫోర్బ్స్ కూడా ఇండియాలో ఉన్న బిలియనీర్ ల జాబితాలో రాందేవ్ బాబా పేరు ప్రకటించింది.