మన తెలుగు ఇండస్ట్రీలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ గురించి తెలియని వారు ఉండరు. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ గా నిలిచాయి. ఆయన పాత్రలు కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి.
అయితే రామ్ తాజాగా తమిళ డైరెక్టర్ లింగస్వామి కాంబినేషన్ లో ది వారియర్ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారు. రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ సినిమా యొక్క టీజర్ ను రిలీజ్ చేసి అభిమానులను ఆనందపరిచారు. ఇందులో ఇంతకుముందు రామ్ ను ఎప్పుడు చూడని విధంగా ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ” మై డియర్ గ్యాంగ్ స్టర్స్ వీలైతే మారిపోండి “.. లేకపోతే పారిపోండి.. ఇదే మీకు నేను ఇస్తున్న ఫైనల్ వార్నింగ్ ” అనే డైలాగ్ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. ఈ మూవీని తెలుగు మరియు తమిళ భాషలలో రూపొందించనున్నారు డైరెక్టర్. ఈ సినిమాలో అక్షర గౌడ కూడా ఒక కీలక పాత్రలో నటించనుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జూలై 14వ తేదీన చాలా గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. ఇక ఈ మూవీ తర్వాత రామ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నారని సమాచారం.