భారతదేశంలో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఎంతమంది ఉన్నా అందులో టాటాలది మాత్రం ఒక ప్రత్యేకమైన మార్క్ ఉంటుంది. వారు ఏ పని చేసిన లాభాలే లక్ష్యంగా మాత్రం పెట్టుకోరు. అందులో కొంత హ్యూమన్ టచ్ తప్పనిసరి ఉంటుంది. అది మొదటి నుంచి టాటాలకు ఉన్నటువంటి అలవాటు. అదే ఒరవడిలో మధ్యతరగతి కుటుంబాలు పడుతున్న టువంటి బాధను తీర్చేందుకే నడుంకట్టారు టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటా. ఈ ప్రయత్నల్లో నుండి వచ్చినది టాటా నానో వాహనం..అసలు ఈ కార్ రూపొందించాలని ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చింది..
అది కార్యరూపం దాల్చడం కోసం తాను ఎలాంటి శ్రమ పడ్డారు విషయాలను తన ఇంస్టా స్టోరీలో రతన్ టాటా తెలియజేశారు. ఇండియాలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా స్కూటర్ల మీదనే ప్రయాణం చేస్తారు. ఒక్కోసారి వారికి ఉన్న ఒక స్కూటర్ మీదనే కుటుంబం మొత్తం వెళ్తూ ఉంటారు. అయితే దాని పై కూర్చున్న పిల్లలు అయితే శాండ్విచ్ మాదిరి తల్లిదండ్రుల మధ్యలో నలిగిపోతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.
ఇలా వారు స్కూటర్ పై వారి కుటుంబాలను ఎక్కించుకుని గుంతలు ఉన్న రోడ్డు దగ్గర వెళ్లడం చాలా ప్రమాదమే కదా.. అలాంటి సంఘటనలు చాలా చూశాను చాలా ఆలోచించాను. వీరి కోసం ఏదైనా తయారు చేయాలనుకున్నాను. ఆ బాధలో నుండి వచ్చింది టాటా నానో కారు. నేను ఆర్కిటెక్ స్టూడెంట్ అవ్వడం వల్ల ఏదైనా ఆలోచన వస్తే దాన్ని ముందుగా రఫ్ డ్రాయింగ్ వేయడం నాకు అలవాటు.
అలా స్కూటర్ ప్రమాద రహితంగా మారాలంటే ఏం చేయాలి అని ఆలోచించాను.. వెంటనే స్కూటర్ కు నాలుగు చక్రాలు వేశాను. అప్పుడు దాన్ని చూస్తే కిటికీలు లేకుండా ఒక బగ్గీల కనిపించింది. ఈ డిజైన్ ను మరింత ముందుకు తీసుకు వెళ్లి చూస్తే నానో ప్రాణం పోసుకుంది. కేవలం లక్ష రూపాయలకు మాత్రమే సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా దీన్ని మొదలుపెట్టి అమలు చేశాను అని రతన్ టాటా అన్నారు.
https://www.instagram.com/p/Cdcni0ArgcE/?utm_source=ig_web_button_share_sheet