శ్రీముఖి తన యాంకరింగ్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పేరు సంపాదించుకుంది. పటాస్ షో ద్వారా చాలా ఫేమస్ అయిపోయింది. ఈ బ్యూటీ ప్రస్తుతం యాంకరింగ్ తో పాటుగా పలు సినిమాల్లో కూడా నటిస్తోంది. ఈమధ్య సుమా హోస్ట్ గా చేస్తున్న క్యాష్ అనే షోలో తన పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతోంది. ఈ ప్రోగ్రాం కి ఆమెతోపాటు జాతిరత్నాలు థీమ్ ను కూడా తీసుకు వచ్చిందని చెప్పవచ్చు.
అయితే ఈ షోలో ఆమె పలు కీలక ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులకు తెలియజేసింది. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రోమో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే శ్రీముఖి ఇండస్ట్రీలోకి వచ్చి 10 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటివరకు ఎవరితోనూ ప్రేమలో పడక పోవడానికి ఒక వ్యక్తి కారణం అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది.
అయితే ఈ ప్రోమోలో శ్రీముఖి మాట్లాడుతుంటే లవ్ సింబల్స్ చూపించారు. ఈ ప్రోమో లో తనకు కాబోయే భర్త ను పరిచయం చేస్తూ ఉన్నట్టుగా చూపించి ఆ ప్రోమోను కట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ప్రోమో వైరల్ గా మారింది. శ్రీముఖి తను ప్రేమించే వ్యక్తిని పరిచయం చేయబోతుందా.. లేదా హైప్ కోసం దీన్ని ఇలా డిజైన్ చేశారా అనే విషయం ఈ షో పూర్తిగా చూస్తే గాని అర్థం కాదు.
ఈ విధంగా శ్రీముఖి ఏ షో లో అయినా ఏదో ఒక స్టొరీ తో హైప్ క్రియేట్ చేస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు లవ్ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక వ్యక్తిని లవ్ చేసి బ్రేకప్ అయిందని, ఆ సమయంలో డిప్రెషన్ లోకి కూడా వెళ్లానని.. నేను లవ్ చేసిన వ్యక్తి కూడా అందరికి తెలిసిన వాడే నని చెప్పింది.