Ravi Teja Khiladi: రూమర్స్ కి చెక్ పెడుతూ…తిరిగి ఆటను మొదలు పెట్టబోతున్న ‘ఖిలాడి’ రవి తేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటున్న సినిమా ‘ఖిలాడి’. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా షూటింగ్స్ అన్ని ఆగిపోయిన సంగతి తెలిసిందే.
రవి తేజ ‘ఖిలాడి’ తో పాటుగా మరో సినిమా రామ రావు సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇక ‘ఖిలాడి’ సినిమా ఆగిపోయిందని షూటింగ్ ఇప్పట్లో జరగదని వస్తున్న పలు రూమర్స్ కి చెక్ పెడుతూ చిత్ర యూనిట్ రే షూట్ చేసే తేదీతో సహా ప్రకటించారు.
Also Read: ఇంక “సౌందర్య” పాత్ర లేనట్టేనా..? అర్చన అనంత్ “కార్తీకదీపం”లో కనిపించకపోవడానికి కారణం ఇదేనా..?
ఈ షెడ్యూల్ లో అన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఒక పాత కుడా పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం ఇవ్వనున్నారు.ఈ సినిమాలో హీరో అర్జున్ ఒక పాత్ర పోషిస్తున్నారు, జబరదస్త్ బ్యూటీ అనసూయ కూడా ఇందులో నటిస్తుంది.