ravi theja rama rao heroine: మాస్ మహారాజ్ ‘రవితేజ‘ కొత్త చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఈ చిత్రం ద్వారా శరత్ మండువా అనే దర్శకులు పరిచయం కాబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా కి సంబంధించి కొన్ని పోస్టర్స్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో రవితేజ కలెక్టర్ పాత్రలో మెప్పించబోతున్నారు.
రీసెంట్ గా వచ్చిన పోస్టర్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో రవితేజ సరసన నటించబోయే హీరోయిన్స్ గురించి చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. నాగ చైతన్య హీరోగా ‘మజిలీ’ సినిమా ద్వారా వెండితెరకి పరిచయం ఆయినా హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్,రజీషా విజయన్ లు రవితేజా కి జోడిగా కనిపించబోతున్నారు. ఇదే విషయం చిత్ర యూనిట్ తెలియచేసింది.
ఈ సినిమా ని మేకర్స్ సంక్రాంతి 2022 కి ప్రేక్షకుల ముందుకి తీసుకురావడనికి ప్రయత్నిస్తున్నారు. రవి తేజ నడిచిన మరో చిత్రం ‘ఖిలాడీ’ చిత్రీకరణ దశలో ఉంది. హీరోయిన్స్ సంబందించిన పోస్టర్స్ ఇప్పుడు విడుదల చేసారు.