చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలనుంచి రవీంద్ర జడేజా తప్పుకోవడం పైన తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఐపీఎల్ ప్రారంభానికి మూడు రోజుల ముందుగానే చెన్నై కెప్టెన్సీకి ధోని గుడ్ బై చెప్పేసారు.
దీంతో కెప్టెన్సీ బాధ్యతలు రవీంద్ర జడేజా చేతికి వెళ్లాయి. కానీ ఈ సీజన్లో అతని కెప్టెన్సీలో ఎనిమిది మ్యాచ్ లు ఆడితే ఏకంగా ఆరు మ్యాచ్ ల్లో ఓడి పోయింది.
దీంతో పాయింట్ల పట్టిక లో చివరి నుంచి రెండో స్థానానికి చెన్నై టీం చేరింది. ఈ దశలోనే మళ్లీ ధోని చేతికి పగ్గాలు వచ్చాయి. కెప్టెన్ గా రవీంద్ర జడేజా ఏ మాత్రం తన పర్ఫామెన్స్ చూపించలేక పోయాడు అని.. అలాగే కెప్టెన్సీ ఒత్తిడి కారణంతో తన ఫామ్ ని కోల్పోయాడని, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అనేక తప్పిదాలు చేస్తున్నాడని తెలుస్తోంది.
బౌండరీ లైన్ ల వద్ద కూడా ఎంతో క్లిష్టమైన క్యాచ్ లను సైతం సులువుగా పట్టుకునేటువంటి జడేజా.. కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత చేతుల్లో పడ్డ బంతులను కూడా వదిలేశాడు.. ఈ విధంగా కెప్టెన్సీ ప్రభావం జడేజాపై పడగా.. ఆ ఎపెక్ట్ అంతా టీమ్ పై పడింది. దీంతో వరుస మ్యాచ్ ల్లో ఓటమి పాలయ్యారు. దీంతో జడేజా మీద చెన్నై టీమ్ మొత్తం సీరియస్ అయినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి.