ఓటు అనేది రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు. అర్హత ఉండి ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వెయ్యాలి. మన ఓటు ద్వారా మనకు నచ్చిన నాయకుని ఎన్నుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. మన ఓటుకి ఎంత పవర్ ఉందంటే అది నాయకుల తల రాతను, మన మన దేశ తలరాతనే మార్చేసే అంత. అయితే చాలామందికి ఓటు విలువ తెలియకుండా దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు.
నోటుకి,బీరుకి, బిర్యాని కి కక్కుర్తి పడి ఓటుని అమ్మేసుకుంటూ ఉంటారు. అయితే ఈ రాజకీయాలు మనకెందుకు అని చాలామంది ఓటు వేయకుండా దూరంగా ఉంటున్నారు. ఎక్కువగా యువత ఓటు వేయడానికి ఆసక్తి చూపించడం లేదు.
అయితే తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ఒక గ్రామం మొత్తం ఓటు వేయకుండా బహిష్కరించిందట. దీనికి వెనక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజస్థాన్ లో ఒకరోజు ఎన్నికలు హడావిడి ఉంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరిగి 200 నియోజకవర్గాలకు గాను 199 నియోజకవర్గాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 68% ఓటింగ్ పోల్ అయింది. కానీ జైపూర్ జిల్లాలోని పాలావాల జతన్ గ్రామస్తులు మాత్రం ఓటు వేసేందుకు నిరాకరించారు. ఒక్కరు కూడా ఓటేసేందుకు కదిలి రాలేదు.
దాని వెనుక ఉన్న కారణం ఏంటంటే తమ గ్రామం నుండి తూంగా గ్రామానికి రోడ్డు వెయ్యాలని ఈ గ్రామస్తులు ఎన్నో దశాబ్దాలుగా అధికారులను నాయకులను కోరుతున్నారు. అయితే ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.దీంతో ఆగ్రహానికి గురైన ఓటర్లు ఏకంగా ఎన్నికలనే బహిష్కరించారు. దశాబ్ద కాలంగా ఓటు వేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ తో కలిపి ఏడుసార్లు ఎవరు ఓటు హక్కును వినియోగించుకోలేదని తెలుస్తుంది.