కాలం మారుతోంది.. సమాజం కూడా దానికి తగ్గట్టుగా ఆలోచన చేస్తోంది. టెక్నాలజీ పెరిగినకొద్దీ ఆలోచనా విధానంలో మరిన్ని మార్పులు వస్తున్నాయి. భయం, భక్తి,సిగ్గు, ఎగ్గు అన్నీ వదిలేసి ఎక్కడబడితే అక్కడ అరాచకాలకు పాల్పడుతున్నారు.
దీన్నిచిలిపి పని అనాలా..కామం నెత్తి కెక్కింది అనాలా.. ఇలా కొత్త కొత్త తిక్క ఆలోచనలతో చివరికి చిక్కుల్లో పడుతున్నారు.. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన యువత పెడదారి పడుతున్నారు.
ఏ పార్కుల్లో, ఏ సందులో చూసిన ఈ జంటలు తారసపడుతున్నారు. అనువుగాని స్థలాల్లో సరసాలాడుతూ చివరికి అబసు పాలవుతున్నారు. ఇలాంటి ఓ జంట ఒక కొత్త ప్లాన్ వేసింది. అద్దె పేరుతో వచ్చి వారి సరసాలకు అడ్డాగా మార్చుకుంది. చివరికి అడ్డంగా బుక్కయ్ బొక్క బోర్లా పడింది. మరి ఏం జరిగిందో చూద్దామా..!!
హైదరాబాదులోని ఎస్సార్ నగర్ లో టు లెట్ బోర్డు చూసి ఇల్లు అద్దెకు కావాలని ఒక జంట ఆ ఇంటి యజమానిని అడిగింది. దీంతో ఆ ఇంటి యజమాని పై పోర్షన్లో ఖాళీ ఉందని వెళ్లి చూడాలని చెప్పాడు. ఆ జంట వెంటనే రెండవ అంతస్తులోకి వెళ్లి చాలా సమయం వరకు కిందికి రాలేదు.
దీంతో వారు ఇంకా కిందికి రాలేదని ఇంటి ఓనర్ పైకి వెళ్లి చూడగా ఆ జంట ఆదమరిచి చీకట్లో రొమాన్స్ చేస్తూ కనిపించారు. వారిని చూసిన ఇంటి ఓనర్ అవాక్కయ్యాడు. వెంటనే ఆ జంట బట్టలు సరి చేసుకొని పరుగో పరుగు అంటూ బైక్ ఎక్కి పారిపోయారు. దీంతో ఇంటి ఓనర్ ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
watch video :