వండే ప్రపంచ కప్ టోర్నమెంట్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం బారిన పడ్డ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ టోర్నమెంట్ నుండి తప్పుకున్నాడు. గాయ నుంచి కోలుకోలేకపోవడం వల్ల అతడు జట్టులోకి రీఎంట్రీ ఇవ్వట్లేదు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వెల్లడించింది.
నెదర్లాండ్స్ తో జరిగే మ్యాచ్ నాటికి హార్దిక్ పాండ్యా జట్టులోకి అందుబాటులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. గాయం నుండి పాండ్యా ఇంకా కోలుకోలేదని ఫిట్ నెస్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడని బీసీసీఐ తెలిపింది. టోర్నమెంట్ నుండి వైదొలిగినట్లుగా పేర్కొంది.
ఇది భారత్ టీంకు భారీ దెబ్బ అని చెప్పాలి. ఆల్ రౌండర్ లేని లోటును రోహిత్ సేన ఎలా పూడ్చుకుంటుందో చూడాలి. అయితే టీమిండియా తన తదుపరి మ్యాచ్ ను నవంబర్ 5వ తేదీన దక్షిణాఫ్రికా తో ఆడనుంది. కలకత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరగనుంది. శ్రీలంక పై ప్రదర్శించిన దూకుడు కొనసాగితే దక్షిణ ఆఫ్రికా పై గెలుపు సులువే అవుతుంది.ముందుగా టీమిండియా సెమీఫైనల్స్ బెత్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను నేరుగా ఆ మ్యాచ్ లోనే ఆడించాలని మేనేజ్మెంట్ భావించింది. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. అతడు కోలుకోకపోవడంతో అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి హర్డిక్ పాండ్యా స్థానంలో బౌలర్ ప్రసిద్ధ కృష్ణను జట్టులోకి తీసుకుంది.
ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్ధారించింది. హార్దిక్ పాండ్యా బదులుగా ప్రసిద్ధ కృష్ణాను టీమిండియా జట్టులోకి తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.అయితే హార్దిక్ లేని లోటును జట్టు ఎలా సమతూకం చేస్తుందో అంటూ భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రోహిత్ సేన ప్రస్తుత ఫామ్ కొనసాగితే మిగిలిన మ్యాచ్ లలో గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే కీలక సమయంలో హార్దిక్ పాండ్యా లాంటి ఆల్‌రౌండర్ లేని లోటు కచ్చితంగా కనబడుతుంది.
Also Read:బ్యాట్ పై “ఓం”..‘జై శ్రీ హనుమాన్’ అంటూ పోస్ట్…పాక్‌ను ఓడించిన ఈ ఆంజనేయ భక్తుడు ఎవరో తెలుసా.?