నిన్న న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. రోహిత్ తన దుకుడైన ఆటతో మంచి స్కోర్ చేశాడు. రోహిత్ అవుట్ అయిన వెంటనే కింగ్ కోహ్లీ బరిలోకి దిగాడు. అయితే కోహ్లీకి తో పాటు గిల్ కూడా మంచి బాగా ఆడుతూ స్కోర్ ని జనరేట్ చేశారు.
గిల్ 70 పరుగులు దాటిన తర్వాత రిటైర్డ్ హార్ట్ గా వెనుతిరిగాడు. ముంబైలోని పిచ్ హ్యుమిడిటీ కారణంగా క్రాంప్స్ వచ్చేసి పరుగులు తీయలేక ఇబ్బంది పడ్డాడు.వెంటనే రోహిత్ గిల్ ను వెనక్కి వచ్చేమని ఆజ్ఞాపించాడు. గిల్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ లోకి వచ్చాడు. రావడం రావడం తో శ్రేయస్ కూడా మంచి దూకుడుగా ఆడాడు.
కోహ్లీ, శ్రేయస్ ఇద్దరూ కలిసి సెంచరీలతో చెలరేగిపోయారు. అందరు కలిసి భారత్ కి 398 పరుగుల భారీ స్కోరు అందించారు. అయితే లాస్ట్ లో గిల్ తిరిగి మళ్ళీ బ్యాటింగ్ కి వచ్చాడు.అయితే ఇప్పుడు గిల్ రిటైర్డ్ హార్ట్ వెనకాల రోహిత్ హస్తముంది అంటూ ఇంటర్నెట్ లో ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు. రోహిత్ కావాలని గిల్ ను రిటైర్డ్ హార్డ్ తీసుకుని వెనక్కి వచ్చేసేలా ప్లాన్ చేశాడని చెబుతున్నారు. మంచి ఫామ్ లో బ్యాటింగ్ చేస్తున్న గిల్ రిటైర్డ్ హార్ట్ తీసుకుని వెనక్కి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు.
అప్పటికే 70 పరుగులు దాటి చేయగా కొద్దిసేపు నిలకడగా ఆడితే గిల్ కి సెంచరీ అయ్యేది. ఏ బ్యాట్స్ మెన్ అయినా కూడా ఇలాంటి పెద్ద పెద్ద టోర్నీలో మంచి పరుగులు చేయాలని చూస్తాడు తప్ప ఇలా అబద్ధపు సాకులతో వెనక్కి వెళ్ళిపోవాలని అనుకోడు. రోహిత్ శర్మ కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ చెయ్యడని ఇండియన్ క్రికెట్ అభిమానులు అంటున్నారు. సో వైరల్ అవుతున్న వీడియోలో ఏమాత్రం నిజం లేదనేది వాస్తవం.ఇండియా సెమి ఫైనల్స్ వెళ్లడం ఇష్టం లేనివారు ఇలాంటి వార్తలు సృష్టించి స్ప్రెడ్ చేస్తున్నారని భారత అభిమానులు అంటున్నారు.
Also Read:ఇదేందయ్యా ఇది… ఈ ప్లేయర్ గురించి కలలో వచ్చినట్టే జరిగిందిగా..? ఎవరంటే..?