ఆడవాళ్ళలో వారి ఫేస్ రీడింగ్ ను బట్టి కొంతమంది మహర్జాతకులుగా ఎదుగుతారు. మరి అలాంటి ఆడ వారు ఎవరు.. వారిలో ఏ లక్షణాలు ఉంటే మహర్జాతకులో ఓ సారి చూద్దాం..!!
#1 విశాలమైన నుదురు
తలపైన నుదురు భాగం ఎంత విశాలంగా ఉంటే ఆడవారికి అంత బాగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే నుదిటి పైన గీతలు కూడా చక్కగా కనిపిస్తే తొందరలో ఆడవారికి అదృష్టం పట్టబోతుంది అని అర్థం.
#2కనుబొమ్మలు
ఆడవారికి కనుబొమ్మలు షార్ప్ గా ఉంటే అంటే హైబ్రోస్ అనేవి ఒక బాణం లాగా షార్ప్ గా ఉంటే అలాంటి ఆడవారు జీవితంలో నెంబర్ వన్ గా సక్సెస్ అవుతారని ఫేస్ రీడింగ్ లో చెప్పడం జరిగింది.
#3ఎడమ కంట్లో పుట్టుమచ్చ
అలాగే ఆడవారికి ఎడమ కంట్లో పుట్టుమచ్చ ఉంటే వారికి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. అది కూడా తేనె రంగులో పుట్టుమచ్చ ఉండాలి. ఇలాంటి ఆడవారు కొంచెం కష్టపడితే ఫలితం దానికి మూడు రెట్లు ఉంటుంది.
అయితే చాలా మంది చాలా కష్టపడితేనే కొంత ధనం వస్తుంది కానీ స్త్రీలకు ఎడమ కంట్లో పుట్టుమచ్చ ఉంటే మాత్రం కొద్దిగా కష్టపడితేనే విపరీతంగా ధనాన్ని సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.#4 గుండ్రటి కళ్ళు
ఇటువంటి స్త్రీలకి ఆదాయం తక్కువగా ఉన్నా కానీ పేరుప్రతిష్టలు అనేవి చాలా ఉంటాయి. ధనం కంటే సొసైటీలో చాలా పేరు సంపాదిస్తారు. ఇలాంటి వారు కీర్తిప్రతిష్టలు ఎక్కువగా సంపాదించుకుంటారు.
#5 ఎడమ బుగ్గ మీద పుట్టుమచ్చ
ఇలాంటి ఆడవారు తిరుగులేని ధనవంతులవుతారు. వివాహం అయిన తర్వాత భర్తతో విపరీతంగా ధనం కలిసివస్తుంది. భర్త నుంచి అన్ని రకాల ఆస్తిపాస్తులు పొందుతారు. ఎప్పుడు సుఖసౌఖ్యాలు భోగభాగ్యాలతో విరాజిల్లుతారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.