రాజస్థాన్ రాయల్స్ జట్టులో స్టార్ స్పిన్నర్ అయినా యుజ్వేంద్ర చాహల్ తన జీవితంలో ఎదురైనటువంటి ఒక చేదు ఘటన గురించి చెప్పాడు. తాను ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్న ని వివరించాడు. మరి ఆయన మీదికి వచ్చింది దోపిడి దొంగలో, రౌడీలో కాదు. అతను కూడా ఒక ఐపీఎల్ సభ్యుడే నట. వారి మధ్య సరదాగా ప్రారంభమైన ఆట కాస్త ప్రాణాల మీదకు తెచ్చిందట.
నాటి సంఘటనపై చాహల్ పెదవి విప్పారు. ప్రస్తుతం చాహల్ రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ జట్టు ఏర్పాటు చేసినటువంటి కం బ్యాక్ టైల్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని అతని జీవితంలోని చేదు ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఈ యొక్క కార్యక్రమానికి హోస్టుగా రవిచంద్రన్ అశ్విన్ వ్యవహరించారు. ఈ ఘటన తన జీవితంలో 2013లో చోటుచేసుకుందని ఆ సమయంలో ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడుతున్నారని అన్నారు. మేమంతా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో మ్యాచ్ ఆడి సభ్యులంతా ఒక రూమ్ లో గెట్ టుగెదర్ అయ్యాం.
అప్పుడే ముంబై ఇండియన్స్ లోని ఒక సభ్యుడు ( పేరు చెప్పను ) బాగా తాగి నా వద్దకు వచ్చాడు. అనంతరం నన్ను అమాంతం పైకి లేపి.. బాల్కనీ నుంచి కిందికి వేలాడదీశాడు. నేను వెంటనే అతని మెడని పట్టుకుని గట్టిగా అరుస్తున్నా.. ఒకవేళ అతని మెడ నా చేతిలో నుంచి జారి పోతే నేను 15వ ఫ్లోర్ నుంచి కిందకు పడిపోయే ప్రమాదం ఏర్పడింది.. నేను అలా అరుస్తూ ఉండగా ఇతర టీం సభ్యులు వెంటనే వచ్చి నన్ను కాపాడారు. ఆ షాక్ లో నేను స్పృహ కోల్పోయానని, ఇది నా జీవితంలో దారుణమైన సంఘటనని మరోసారి గుర్తు చేసుకున్నాడు.