హిందువులు కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. పరమశివుడికి ఇష్టమైన కార్తీక మాసంలో శివాలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. మహిళలు తెల్లవారుజామున లేచి స్నానాలు ఆచరించి దీపారాధనలు చేస్తూ శివుడిని కొలుస్తారు. శివాలయాలు అభిషేకాలు నిర్వహించడం దీపార్చనలు చేయడం కల్యాణ కార్యక్రమాలు ఇలా కార్తీకమాసం అంతా పూజలతో బిజీబిజీగా గడుపుతూ ఉంటారు.
కార్తీక మాసానికి మరో విశిష్టత ఏంటంటే వనభోజనాలు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు స్నేహితులు గృహ నివాసాల వారు ఒకచోట చేరి ఉసిరి చెట్టు వద్ద వనభోజనాలు ఏర్పాటు చేసుకుని ఐక్యతను చాటుతారు. చాలామంది కార్తిక మాసం వస్తే చాలు ఉపవాస దీక్షలు చేపడుతూ ఉంటారు. అయితే చాలామందికి ఉపవాస దీక్షలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియదు. అలాంటి వారికోసం కార్తీక మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి వివరాలు తెలియజేస్తున్నాం…
1. ఉపవాస సమయంలో మహిళలు ఎక్కువగా పనిచేయకుండా కాస్త విశ్రాంతి తీసుకోవాలి. తినాలి అనే ధ్యాస లేకుండా ఎక్కువ పనిచేస్తూ ఉంటారు. అలా కాకుండా కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవడం మంచిది.
2. భక్తికి సంబంధించిన సంగీతం వింటూ ఉండాలి వీలైనప్పుడల్లా ధ్యానం చేయడం మంచిది.
3. ఉపవాసం చేసిన మర్నాడు ఆకలిగా ఉందని ఎక్కువగా తినేయకూడదు… ముందుగా ద్రవాహహారం తీసుకోవాలి, తర్వాత గణాహారం తీసుకోవాలి.
4. మసాలాలు లేకుండా శాఖాహారం, తేలికగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. శీతాకాలంలో అరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. అన్నం కూరలతో పాటు సగ్గుజావా, పండ్లు, కూరగాయలను తినాలి.
ఈ జాగ్రత్తలు పాటిస్తూ కార్తీక మాసపుణ్య దీక్షను ఆచరిస్తే భక్తులకు ఇటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా దీక్ష విజయవంతంగా పూర్తి అవుతుంది.
Also Read:మీ చేతి మీద ఇలాంటి గుర్తు ఉందా..? దాని అర్ధం వింటే షాక్ అవ్వాల్సిందే..!