శుక్రవారం రాత్రి హీరో సాయి ధరమ్ తేజ్ కి బైక్ ఆక్సిడెంట్ జరిగింది. మాదాపూర్ లోని మెడికవర్ హాస్పిటల్ లో చికిత్సపొందుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద తన స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుంటే ఈ ఆక్సిడెంట్ జరిగింది అంట. కేబుల్ బ్రిడ్జి నుండి ఐకియా జంక్షన్ కి వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్పోర్ట్స్ బైక్ పై నుండి కింద పడిపోయారు. దీంతో ఆయన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు అంట. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ హెల్త్ కండీషన్ ఇదే.. డాక్టర్స్ ఇచ్చిన అప్ డేట్ ఏంటంటే !
“సాయి ధరమ్ తేజ్ గారి ఆరోగ్యం నిలకడగా ఉంది. కానీ ఇంకా ఐసీయూ లోనే ఉంటారు. ఇంకా కొన్ని అవసరమైన చికిత్సలు ఈరోజు నిర్వహించబడతాయి. తదుపరి హెల్త్ బులిటెన్ రేపు ప్రకటిస్తాము” . అంటూ హెల్త్ బులిటెన్ విడుదల చేసారు.
watch video:
https://youtu.be/b9N390R_oFI