అక్కినేని వారసుడు నాగ చైతన్య, సమంతల పైన వ్యక్తిగత జీవితం పైన గతి కొన్ని రోజులుగా మీడియా లో వస్తున్న వార్తలు అందరికి తెలిసిందే. వారిరువురు విడిపోతున్నట్టు, విడాకుల వరకు వెళ్లిందని సోషల్ మీడియా తో పాటుగా న్యూస్ చానెల్స్ లో కూడా మారుమోగిపోయింది. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ కూడా .
అయితే ఈ విషయం పై అక్కినేని ఫామిలీ గాని, సమంత కానీ ఎవరు స్పందించలేదు, ఈ వార్తలని కండించలేదు. ఇక నెక్స్ట్ వీక్ లో విడుదలకి ముస్తాబు అవుతున్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా ట్రైలర్ గత వారం లో విడుదల అయ్యింది. ఈ సినిమా కి ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు రావాల్సింది ఉంది వారితో మాట్లాడాల్సి ఉంది.
ఇక ఈ విషయం ఎలాగైనా బయటికి లాగొచ్చు అనుకున్న మీడియా కి నిరాశే ఎదురైంది. తన వ్యక్తిగత జీవితానికి సంబందించిన వార్తలు, విషయాలు గురించి చర్చలు, ప్రస్తావనలు లేకుంటేనే ఇంటర్వ్యూ లు ఇస్తానంటూ షరతులు పెట్టారంట. ఇప్పుడు ఇదే విషయం పై చర్చలు సాగుతున్నాయి. కరోనా ప్రభావంతో ఇప్పటికే చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న సినిమా ఇక ఈ సినిమా సెప్టెంబర్ 24 న ప్రేక్షకుల ముందికి రానుంది.