సమీరా రెడ్డి, ఒకప్పుడు ఈ బ్యూటీ తన అందంతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. మెగాస్టార్ చిరంజీవితో జై చిరంజీవ, జూనియర్ ఎన్టీఆర్తో అశోక్ మూవీలో నటించి తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది సమీరా రెడ్డి.
తెలుగు,తమిళ్ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించింది. సమీరా కెరియర్ టాప్ స్టేజ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత పూర్తిగా మూవీస్ కు దూరమైంది. సమీరాకి ఇద్దరు పిల్లలు. సినిమాలకు అయితే దూరమైంది. కానీ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లోనే ఉంటుంది సమీరా రెడ్డి. సోషల్ మీడియా వేదికగా ఉపయోగకరమైన పోస్టులు పెడుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
అధిక బరువును ఎలా తగ్గించుకోవాలి,ఏం చేయాలి అనే దానిపై సమీరా ఫ్యాన్స్ కి సలహాలు కూడా ఇచ్చారు. వీక్లీ 4 సార్లు యోగా, బ్యాడ్మింటన్ చేయడంతో పాటు,అప్పడప్పుడు ఉపవాసం చేస్తూ బరువు తగ్గనని తెలిపారు అంతేకాకుండా సోషల్ మీడియాలో బరువు పెరిగిన ఫోటోను, తర్వాత సన్నగా అయిన ఫోటోను షేర్ చేసి ఎంతోమందికి మార్గదర్శకురాలిగా నిలుస్తున్నారు. ఇక సమీరా రెడ్డి రెండో బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఆ అనుభవాల్ని వెల్లడిస్తానని ముందే ఫ్యాన్స్ కి మాట ఇచ్చిన సమీరా, ఆ తరువాత ఆ విషయాల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటూ కాబోయే తల్లులకు ధైర్యాన్ని ఇస్తూ ఆదర్శంగా నిలుస్తునాన్నారు.అంతేకాకుండా బిడ్డకు పాలివ్వడం వల్ల అందం చెడిపోతుందని రకరకాలుగా బయట సమాజం మాట్లాడుకుంటుంది. అలా అనుకోవడం సరికాదని చెబుతోంది. గోవాలో ఉంటున్న ఆమె రోజువారీ విశేషాలు, ఆరోగ్య చిట్కాలు, వంటలు వంటి అనేక విషయాలను సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో, నెటిజన్లతో పంచుకుంటూ అలరిస్తున్నారు. ఇక ఈ నేచురల్ బ్యూటీ అంటూ సమీరారెడ్డి మేకప్ లేకుండా పెట్టిన డీగ్లామరస్ ఫోటోలు ఒకవైపు వైరల్ అవుతుంటే,మరోవైపు వాటికి ట్రోల్స్ కూడా వస్తున్నాయి.అయిన ట్రోల్స్ అన్నిటికీ సమీరా ధీటుగా కౌంటర్లు ఇస్తుంటారు.