వారిద్దరూ అంతర్జాతీయ క్రికెటర్ లో చాలా మంచి పేరున్న క్రీడాకారులు. పాపం వారి పాలిట బ్రెయిన్ ట్యూమర్ శాపంగా మారింది. దీంతో ఇద్దరినీ ఒకే రోజు బలితీసుకుంది. మళ్లీ ఇద్దరు క్రికెటర్లు కూడా బంగ్లాదేశ్ కు చెందిన వారే కావడం విశేషం. బంగ్లాదేశ్ లో తొలి వన్డే జట్టు సభ్యులు అయినటువంటి సామీయుర్ రెహమాన్ 69 సంవత్సరాలు. ఆయన బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ఏప్రిల్ 19 న ఢాకాలోని సిటీ ఆస్పత్రిలో
మరణించారు. ఇదే రోజున బంగ్లా మాజీ లెఫ్ట్ ఆర్ము స్పిన్నర్ గా పేరుపొందిన మషారాఫ్ హోస్సేన్ 40 సంవత్సరాలు ఆయన కూడా ఇదే ప్రాణాంతక వ్యాధి తో పోరాడుతూ మృతి చెందారు. అయితే ఒకే రోజున మాజీ క్రికెటర్లు ఇద్దరు మరణించడం పట్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తోంది. రైట్-ఆర్మ్ ఫాస్ట్ బౌలర్
అయినప్పటికీ సామీయుర్ బంగ్లాదేశ్ వైపు రెండు మ్యాచ్ లు ఆడి ఒక్క వికెట్ కూడా సాధించలేదు. మోషరాఫ్ 2008 నుండి 2016 మధ్యలో ఐదు వన్డేలు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. సామీయుర్ రిటైర్డ్ అయిన తర్వాత బంగ్లాదేశ్ దేశవాళీ టోర్నీలో ఎంపైర్ గా నిర్వహించారు. హోస్సేన్.. బంగ్లా దేశవాలి టోర్నీలో మాత్రం 572 వికెట్లు పడగొట్టి ఒక స్టార్ స్పిన్నర్ గా గుర్తింపు పొందాడు.