Allu Arjun Upcoming list 2023, 2024: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండు సంవత్సరాల నుండి `పుష్ప`మూవీ పణుల్లోనే ఉన్నాడు. ఇంతవరకు కొత్త సినిమా గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు.
అయితే తాజా సమాచారం ప్రకారం బన్నీ తన నెక్స్ట్ సినిమా ఏంటో ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‌తోనే మూవీ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న`పుష్ప-2`సినిమాలో నటిస్తున్నారు. గత సంవత్సరం విడుదలైన `పుష్ప`సినిమాకి ఇది రెండో పార్ట్. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఆర్య, ఆర్య-2 తర్వాత సుకుమార్, బన్నీ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పుష్ప-2 సినిమా 2023లో విడుదల కాబోతుంది.
Allu Arjun Upcoming list 2023
ఫిల్మ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ `పుష్ప` సినిమా తరువాత ఏ డైరెక్టర్ తో చేస్తాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయం పెద్ద సస్పెన్స్ గా మారింది. ఇక బన్నీ వీరి తో చేస్తాడు, వారితో అంటూ చాలా మంది డైరెక్టర్ల పేర్లు మీడియాలో వినిపిస్తున్నాయి. ఇక టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఉన్న స్టార్ డైరెక్టర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.సంజయ్ లీలా భన్సాలీ
ఇక బాలీవుడ్ నుండి అల్లు అర్జున్ కోసం సంజయ్ లీలా భన్సాలీ అందుకే అల్లు అర్జున్ సంజయ్ లీలా భన్సాలిని కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి డైరెక్టర్ అట్లీ
కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ చేయబోతున్నారని తెలుస్తోంది.ఏఆర్ మురుగదాస్
ఏఆర్ మురుగదాస్ కూడా బన్నీతో సినిమా చేస్తున్నాడని అంటున్నారు.కొరటాల శివ
అల్లు అర్జున్ కొరటాల శివతోనూ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.డైరెక్టర్ త్రివిక్రమ్
తాజాగా మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. అల్లు అర్జున్ నెక్ట్స్ చేయబోయే సినిమా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తోనే అని సమాచారం.బోయపాటి శ్రీను
అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా బోయపాటి శ్రీనుతో చేయబోతున్నాడని అంటున్నారు.