ప్రముఖ యూట్యూబర్ దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రతి ఒక్కరికి బాగా పరిచయమే. అలాగే బిగ్ బాస్ కి వెళ్లి మంచి క్రేజ్ కూడా సంపాదించుకుంది. బిగ్ బాస్ సీజన్ 4 లో టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకుంది. బిగ్ బాస్ తర్వాత పలు షోలలో కనిపించిన కానీ కొంతకాలంగా ఆమె బుల్లితెరకు దూరంగానే ఉంటూ వస్తుంది. అయితే అడపాదడప యూట్యూబ్ కవర్ సాంగులతో మెరుస్తుంది.
అయితే తాజాగా అలేఖ్య హారిక లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది అన్న వార్త చక్కర్లు కొడుతుంది. ప్రముఖ యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన కథానాయకుడిగా వస్తున్న చిత్రంలో ఆయనకు జోడిగా అలేఖ్య హారికను మేకర్స్ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను బేబీ నిర్మాత ఎస్.కే.ఎన్, డైరెక్టర్ సాయి రాజేష్ లు కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే యూట్యూబ్ వైష్ణవి చైతన్య కి బేబీ మూవీ తో మంచి ఛాన్స్ ఇచ్చారు.చిన్న సినిమాలకు మినిమం గ్యారంటీగా సంతోష్ శోభన్ ఉన్నారు. ఇప్పటికే ఈయన నటించిన చిత్రాలు యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. చిన్న సినిమాలకు బెస్ట్ ఆప్షన్ గా సంతోష్ శోభన్ మారారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పైన మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అలేఖ్య హారిక సోషల్ మీడియాలో తరచూ వీడియోలు, హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ యువతకి దగ్గరగా ఉంటారు.ఇప్పుడు బేబీ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ మళ్లీ ఆ ఫీట్ ను రిపీట్ చేస్తుందా అంటూ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. మరో పక్క తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇస్తున్న మేకర్స్ ను ఆడియన్స్ అభినందిస్తున్నారు. ఈ అవకాశం తోటైనా సరే అలేఖ్య హారిక ఫేట్ మారుతుందేమో చూడాలి.
Also Read:అప్పట్లో హీరో చెల్లెళ్లుగా నటించిన ఈ 9 మంది గుర్తున్నారా? ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?