ప్రముఖ కమెడియన్ సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం మా ఊరి పొలిమేర. ఈ చిత్రం అప్పుడు మంచి రివ్యూస్ నే సాధించుకుంది. బాలాదిత్య, కామాక్షి భాస్కర్, గెటప్ శీను, రవివర్మ తదితరులు ఈ చిత్రంలో నటించారు. డాక్టర్ విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది.
మా ఊరి పొలిమేర కథ విషయానికొస్తే కొమిరి (సత్యం రాజేష్) జంగయ్య (బాలాదిత్య) అన్నదమ్ములు తెలంగాణలోని జాస్తిపల్లి గ్రామంలో నివసిస్తున్నారు. కొమిరి ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఊళ్లో ఎవరికీ ఏ సాయం కావాలన్నా చేస్తాడు భార్యాబిడ్డలను పోషించడంతోపాటు తమ్ముడు జంగయ్యను చదివిస్తాడు.
జంగయ్య చదువుకుని అదే ఊర్లో కానిస్టేబుల్ అవుతాడు. మద్యం మత్తులో కొమిరి స్నేహితుడు బలిజ(గెటప్ శీను) సర్పంచ్ మనిషిని కొడతాడు. దీంతో అతని తీసుకెళ్లి చావగొడతారు. సర్పంచ్ బంధీలో ఉన్న బలిజను విడిపించడానికి వెళ్ళిన కొమిరి అతని భార్యకు అవమానం ఎదురవుతుంది పెద్దవాళ్లను ఎదిరించలేక ఈ అవమాన భారంతో ముగ్గురు ఇంటికి వస్తారు.కొన్ని రోజులకు ఉరి సర్పంచ్ తో పాటు కవిత అనే గర్భిణీ అనుమానస్పద రీతిలో చనిపోతారు.
దీనికి కారణం కొమిరి అంటూ కవిత బంధువులు అతడిని చంపేస్తారు. అసలు ఈ చావులకు కారణం ఎవరు? కానిస్టేబుల్ జంగయ్య ఈ కేసును ఎలా పరిష్కరించాడు అంటే పూర్తి సినిమా చూడాల్సిందే.ఈ చిత్రంలో కుమిరి జంగయ్య పాత్రలో సత్యం రాజేష్ బాలాదిత్య ఒదిగిపోయిన నటించారు.మిగతా వాళ్ళు ఎవరి పరిధి మేరకు వాళ్ళు నటించారు. సాంకేతికంగా కూడా ఈ సినిమా బాగుంది.
నేపద్య సంగీతం, సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరాయి. బోర్ కొట్టకుండా ఉత్కంఠతో ఉండే విధంగా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో మా ఊరి పొలిమేర చిత్రం విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఇదే టీం మళ్లీ పొలిమేర2 అంటూ ఈ సినిమాకి సీక్వెల్ తీసుకువచ్చారు. ఈ సినిమా కూడా మొదటి పార్ట్ కి ఏ మాత్రం అంచనాలు తగ్గని విధంగా రూపొందించినట్లు చిత్ర టీం ప్రకటించిందిప్రమోషన్ కూడా జోరు మీద చేస్తున్నారు.
Also Read:సైలెంట్ గా రిలీజ్ అయ్యి మరొక సెన్సేషన్ అయ్యింది..! ఈ సినిమా చూశారా..?