నందమూరి బాలకృష్ణ, కాజల్, శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం భగవంత్ కేసరి. దీనిని డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు. అక్టోబర్ 19 విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ రాబడుతుంది. పోటీగా తమిళ సినిమా లియో రిలీజ్ అయిన కూడా ఎక్కడ భగవంత్ కేసరి వెనకడుగు వేయలేదు.
ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ శనివారం చిన్న సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి తన వల్ల జరిగిన చిన్న తప్పు వల్ల అందరి ముందు క్షమాపణలు చెప్పారు.
అసలు విషయంలోకి వెళ్తే శ్రీ లీల తండ్రి పాత్రలో శరత్ కుమార్ కాసేపు కనిపించారు. జైలర్ పాత్రలో ఆయన నటించారు కానీ ఆయన చనిపోయిన సమయంలో టీవీలో వచ్చినప్పుడు సీఐ అయిన స్క్రోలింగ్ వేశారు. ఇదే విషయంపై అనిల్ రావిపూడి కి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ పెద్ద కమర్షియల్ సినిమాలో మీరు ఇంత చిన్న మిస్టేక్ ని గుర్తించడం గొప్ప విషయం. మీ పరిశీలనకు సూక్ష్మ బుద్ధికి హాట్సాఫ్ అంటూ చెప్పారు.
జైలర్ ను సీఐగా న్యూస్ లో చెప్పడం మా తప్పే. మా వాళ్లు పొరపాటుగా అలా వేసి ఉంటారు. అందుకు క్షమాపణలు చెబుతున్నాను అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ భగవంత్ కేసరి సినిమాను ఎంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
రెండు మూడు రోజుల్లో సినిమా సక్సెస్ మీట్ ని భారీ లెవెల్ లో అరేంజ్ చేస్తున్నట్లు తెలియజేశారు. తాను తీసిన ఆరు సినిమాల్లో కల్లా ఈ సినిమా తనకి పూర్తి సాటివేషన్ కలిగించిందని అన్నారు. తనని నమ్మి ఈ అవకాశాన్ని కల్పించిన నందమూరి బాలకృష్ణ కి అనిల్ రావిపూడి అందరి ముందు కృతజ్ఞతలు తెలియజేసారు. ఫుల్ రన్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత అంటే…?