ఇంటర్వ్యూ బోర్డులో ఎంతమంది ఉంటారో, ఏ విధమైన ప్రశ్నలు అడుగుతారో, ఉద్యోగానికి ఎంపికవుతానో? ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అని ఎదురు చూస్తూ ఉంటారు… అయితే ఒక ఇంటర్వ్యూ లో ఒక ఉద్యోగానికి వచ్చిన అభ్యర్దికి సంబంధించిన కొన్ని పర్సనల్ ప్రశ్నలు అడిగిన తర్వాత…. ఈ వైట్ పేపర్ మీద నీ సంతకం పెట్టు అంటూ…ఓ తెల్లని పేపర్ అతని చేతికిచ్చాడంట.!! ఆ వైట్ పేపర్ ను తీసుకున్న అభ్యర్థి చాల సేపు ఆలోచించి తెల్లని పేపర్ ను నాలుగు వైపుల నుండి మధ్యలోకి మడిచి ఆ నాలుగు సైడ్స్ కవర్ అయ్యేలా సంతకం పెట్టి ఇంటర్వ్యూయర్ కు ఇచ్చాడట.! అది చూసిన ఇంటర్వ్యూ యర్ అతని తెలివికి మెచ్చి యస్ యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడట.!
ఇంటర్వ్యూ యర్ అలా వైట్ పేపర్ మీద సంతకం ఎందుకు చేయమన్నాడు అంటే .?
వైట్ పేపర్ మీద సైన్ చేయమనగానే చేసినట్టైతే….అభ్యర్థికి లోక జ్ఞానం లేనట్టు అర్థం. ఇలా చేయమనడం…అభ్యర్థి కామన్ సెన్స్ ను, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ను పరీక్షించడమే.! ఒకవేళ సంతకం నేను చేయను అంటే కూడా అతనిని నెగెటివ్ గా అర్థం చేసుకోవొచ్చు…సో అటువంటి విపత్కర పరిస్థితిని ఇలా తెలివిగా డీల్ చేయడంతో…..అభ్యర్థి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ నచ్చి ఉద్యోగం ఇచ్చారట!