గత కొన్ని రోజులుగా బట్టలకు సంబంధించిన యాడ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శరవనన్ ఇక నుంచి హీరోగా ప్రేక్షకుల హృదయాలను దోచు కోబోతున్నాడు. దీంతో చాలా మంది జనాలు ఇన్ని రోజులు యాడ్స్ తో హింసించిన శరవణన్ ఇక సినిమాలలో ఎలా భరించాలో అంటూ సరదాగా చెప్పుకుంటున్నారు.
అయితే హీరో కావడానికి అందం, ఆహార్యం అవసరం లేదని డబ్బులు ఉంటే చాలు నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఈ మధ్య కాలంలో టీవీలో ఎప్పుడు చూసినా శరవణ స్టోర్స్ గురించి యాడ్స్ ఎక్కువగా వస్తున్నాయి. అందమైన నటీమణుల మధ్యలో హీరోగా నడుచుకుంటూ ఒక వ్యక్తి వస్తాడు అతడే శరవణన్.
ది లెజెండ్ శరవణ స్టోర్స్ ఓనర్. చెన్నై నగరంలో చాలా పాపులర్ అయిన ఈ స్టోర్స్ యాడ్స్ ద్వారా తెలుగు ప్రజలకు కూడా దగ్గరయ్యాయి. అయితే ఈయన స్టోర్స్ కంటే ఎక్కువ యాడ్స్ ద్వారా చాలా పాపులర్ అయిపోయారు. హన్సిక, తమన్నా ఇలాంటి టాప్ కథానాయికలతో కూడా యాడ్ చేశారు. ఈ యాడ్స్ లో శరవణ తప్ప మరో మేలు మోడల్ నటించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన స్క్రీన్ మీద కనిపించడం చాలా ఇష్టమట. ఇష్టం కాదు పిచ్చి అట. ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని ట్రోల్స్ వచ్చిన పట్టించుకోకుండా యాడ్స్ చేసుకుంటూ పోయాడు.
ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈయనతో తమిళ్ లో సినిమా కూడా ఖరారయింది. దర్శక ద్వయం జె.డి, మరియు జెర్రీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తమిళ ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్స్ ఈయన మూవీ లో పని చేయబోతున్నారని టాక్. అయితే ఈయన సరసన నటించడం కోసం టాప్ హీరోయిన్లను సంప్రదించారని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్, పాటలు కూడా ఇటీవల విడుదలయ్యాయి. ఇందులో తమిళ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు పని చేశారు. అయితే జెర్రీ మరియు జె.డి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
watch video:
watch video: