వైయస్సార్ టిపి అధినేత్రి షర్మిల సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ముందు 119 స్థానాల్లో పోటీ చేసినట్టు ప్రకటించిన ఆమె ఇప్పుడు పోటి నుంచి వైదడుగుతున్నట్లు ప్రకటించారు. పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారని ఆయనను ఓడించడం ఇష్టం లేక తాను కూడా పోటీ చేయడం లేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ భవిష్యత్తు కోసమే తాను నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు తనని క్షమించమని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ని ఓడించాలని పార్టీ పెట్టినట్లు ఆమె స్పష్టం చేశారు. అయితే తాను పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని నమ్మకం ఉందన్నారు.
వైయస్సార్ టిపీ శ్రేణులు తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలని షర్మినా పిలుపునిచ్చారు. తెలంగాణలో తన పాదయాత్ర సమయంలో పొంగులేటి తనకు మద్దతుగా నిలిచారని ఇప్పుడు ఆయనను ఓడించేలా తాను నడుచుకోవాలా అని ప్రశ్నించారు. వైయస్సార్ కు గాంధీ కుటుంబం మీద గౌరవం ఉందని రాహుల్ ప్రధాని కావాలని వైఎస్ఆర్ కోరుకున్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ బతికి ఉంటే ఈపాటికి రాహుల్ గాంధీ ప్రధాని అయి ఉండే వారని అన్నారు.వైయస్సార్ కి ఉన్న అభిమానమే తనకి కూడా కాంగ్రెస్ పార్టీ పైన గాంధీ కుటుంబం పైన ఉందని చెప్పుకొచ్చారు.
అందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వద్దామని కేసీఆర్ ని ఇంటికి సాగనంపుదామని అన్నారు.తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలతో పాటు పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలన్నారు. ఇక కాంగ్రెస్ నేతలతో కలిసి షర్మిల ఎన్నికల ప్రచారంలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో టిడిపి పోటి నుంచి తప్పుకోవడం ఇప్పుడు షర్మిల కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో ఇవన్నీ కాంగ్రెస్ కి కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. ఎన్నికల ఫలితాల తర్వాత షర్మిల కు పార్టీలో కీలకమైన బాధ్యతలు ఇచ్చే దానిపై కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.
Also Read:సోనియా – రాజీవ్ గాంధీ” ప్రేమకథ ఏంటో తెలుసా..? వీరి పెళ్లి ఏ పద్ధతిలో జరిగిందంటే..?