Tollywood: కోలీవుడ్ హీరో ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ మూవీ స్కామ్ థ్రిల్లర్ నేపధ్యంలో వస్తోందని సమాచారం. ధనుష్ మాస్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంటే, శేఖర్ కమ్ముల ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి క్లాస్ సినిమాలతో గుర్తింపును తెచ్చుకున్నారు.
మరి హీరో ధనుష్ తో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎలాంటి మూవీని తీయబోతున్నారు. అది శేఖర్ కమ్ముల స్టైల్ సినిమానా, మరి అది ధనుష్ స్టైల్ కు సెట్ అవుతుందా అని, ఈ కాంబో ప్రకటించినప్పటి నుండి ఇటు ఆడియెన్స్ లో, అటు సిని వర్గాల్లో వచ్చిన ప్రశ్నలు. అయితే ఈసారి శేఖర్ కమ్ముల ఒక ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నారు. అది కూడా ఓ స్కామ్ చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది.
హీరో ధనుష్ కు పక్కాగా సెట్ అయ్యే కథ. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుంటారని, వీరిని ఫైనల్ చేయాల్సి వుంది. ఇక శేఖర్ కమ్ముల స్టైల్ ఎమోషన్లు కూడా చాలా వుంటాయని తెలుస్తోంది. సినిమాలో ధనుష్ పాత్ర కాకుండా మరో ముఖ్య పాత్ర ఉంతుందని సమాచారం. ఎమోషనల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. రామ్ మోహన్ రావు, సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ మూవీలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియడానికి మరికొన్ని రోజులు ఎదురుచూడాలి.
దర్శకుడు శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ పనులతో ప్రస్తుతం బిజీగా ఉన్నారని, శేఖర్ కమ్ముల పారితోషికం భారీగా పెరిగిందని సమాచారం. అయితే 10 కోట్ల రూపాయల పారితోషికాన్ని శేఖర్ కమ్ముల తీసుకుంటున్నారని అంటున్నారు. హీరో ధనుష్ నటించే ఒక్కో సినిమాకు ముప్పై నుండి నలబై కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ధనుష్ తెలుగులో నటిస్తున్న రెండవ సినిమా.