ఎంత పెద్ద పేరున్న దర్శకుడైన కొన్ని సినిమాల్లో లాజిక్కులు మిస్ అవ్వడం కామన్ పాయింట్. వారికి ఈ విషయం తెలియకుండానే ఆ మిస్టేక్స్ జరిగిపోతుంటాయి.. అంతకుముందు దర్శకులు చాలా మిస్టేక్స్ చేసేవారు కానీ వాటిని ఎవరూ కూడా పట్టించుకునే వారు కాదు.
కానీ సోషల్ మీడియా పెరిగిపోవడంతో సినిమాలను ఓటీటీల ద్వారా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వీక్షిస్తున్నారు. దీంతో దర్శకుడు ఆ సినిమాలో ఇలాంటి మిస్టేక్ చేసిన వెతికి మరీ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్..!
అయితే తాజాగా విడుదలైన సినిమాలకి కాకుండా ఎప్పుడో విడిపోయిన సినిమాల్లో కూడా ఈ తప్పులను చూపిస్తూ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. అయితే రీసెంట్ గా సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ మహేష్ బాబు దగ్గర 25000 డాలర్లు అప్పు తీసుకుంటుంది. కానీ మహేష్ బాబు మాత్రం పదివేల డాలర్లు అప్పు ఇచ్చాను అని తిరిగి ఇవ్వాలని అంటాడు. ఇక దర్శకుడు లాజిక్ మిస్ అవడంతో నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
దీంతో రంగంలోకి దిగిన దర్శకులు క్లారిటీ ఇస్తున్నారు. అలాగే హీరో వరుణ్ తేజ్ కెరీర్లోనే చెప్పుకోదగ్గ మూవీ ఫిదా. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఇందులో వరుణ్ ఎన్నారై పాత్రలో నటించగా, సాయి పల్లవి మొత్తం పక్క తెలంగాణ యాసలో పక్క తెలంగాణ పిల్లల నటన అదరగొట్టింది. ఇందులో వరుణ్ తేజ్ తన అన్నతో కలిసి అమెరికాలో జీవిస్తాడు.
సాయి పల్లవి సోదరి యాక్టర్ వరుణ్ తేజ్ సోదరున్ని పెళ్లిచేసుకుని అమెరికా వెళ్లి పోతుంది. కానీ ఒక సీనులో సాయి పల్లవి మాత్రం అక్క తో ఫోన్ మాట్లాడుతుంది. ఓకే అంతా బాగానే ఉంది. కానీ అమెరికాలో డే ఉంటే, ఇండియాలో మొత్తం చీకటి అవుతుంది. కానీ ఈ సీన్ లో మాత్రం మొత్తం డే గానే చూపిస్తారు. ఈ మిస్టేక్ ను ఎత్తి చూపిస్తూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు శేఖర్ కమ్ముల అంటూ కామెంట్లు చేస్తున్నారు.