ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సర్కారు వారి పాట గురించే విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అయితే ఈ మూవీ కోసం మహేష్ అభిమానులు గత రెండు సంవత్సరాల నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
ఈ తరుణంలో సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్ లోకి వచ్చింది. వచ్చిన మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా డిజాస్టర్ సర్కారు వారి పాట అంటూ హ్యాష్ ట్యాగ్ తో క్యాప్షన్ పెట్టి తీవ్రంగా వైరల్ చేశారు.. అయితే దీనిపై మహేష్ అభిమానులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కావాలనే కొంతమంది సినిమాను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే సినిమాలోని “మామ మహేషా అనే సాంగ్ రిలీజ్ అయినప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా కొంతమంది తమన్ మ్యూజిక్ కాపీ కొట్టారని సరైనోడు మూవీలోని “బ్లాక్ బస్టరే” సాంగ్ ను ఇక్కడ వాడుకున్నారని తీవ్రంగా వైరల్ చేశారు. అయితే ఇదే తరుణంలో మళ్లీ మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ క్లైమాక్స్ లో హీరోను పోలీసుల షూట్ చేయాలి.
కానీ కానిస్టేబుల్స్ అతన్ని కాల్చేయమంటే కాల్చరు. మీలాంటి మంచి వాళ్ళు బతకాలి అంటారు. అయితే ఈ సీన్ చూస్తే శివాజీ సినిమాలో రజినీకాంత్ జైల్లో పడ్డప్పుడు ఆయన్ని కొట్టమంటే కానిస్టేబుల్ కొట్టడు.. లేదండి నేను కొట్టను ఆయన నా బ్రదర్ చదువుకి హెల్ప్ చేశాడు అంటూ చెబుతాడు.. అంటే ఈ డైలాగ్ సర్కారు వారి పాట లోని డైలాగ్ ఒకే విధంగా ఉండడంతో సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వస్తున్నాయి.