ప్రస్తుతం ఎస్ ఎస్ థమన్ హవా మాములుగా లేదు. వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. థమన్ సంగీతం అందించిన సినిమాలు దాదాపుగా అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అవుతున్నాయి.
టాలీవుడ్ లో వరసగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో సినిమాలు చేస్తున్నాడు థమన్. ఇలా టాప్ సినిమాలతో పాటు మీడియం, స్మాల్ బడ్జెట్ చిత్రాలకు కూడా పనిచేస్తున్నాడు ఈ టాప్ సంగీత దర్శకుడు.
నాగ శౌర్య హీరోగా వస్తోన్న వరుడు కావలెను సినిమాకు కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుండి లేటెస్ట్ గా ఫోక్ నెంబర్ దిగు దిగు నాగ ప్రోమోను విడుదల చేసారు. ఫుల్ సాంగ్ ను ఆగస్ట్ 4న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
అయితే ప్రోమోతోనే ఈ సాంగ్ ఆకట్టుకుంది. గ్రామీణ ప్రజల్లో బాగా నాటుకుపోయిన దిగు దిగు ఫోక్ నెంబర్ ను తనదైన స్టైల్ లో ప్రెజంట్ చేసినట్లు ఉన్నాడు థమన్. అనంత్ శ్రీరామ్ ఈ పాటను రాయగా శ్రేయ గోషాల్ పాడింది. ఈ చిత్రంలో నాగ శౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. లక్ష్మి సౌజన్య దర్శకురాలు.