మనం టాలీవుడ్ ఇండస్ట్రీని నిశితంగా గమనిస్తే ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవి లాగా సొంత టాలెంట్ తో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి స్టార్డమ్ తెచ్చుకున్న వారు చాలా తక్కువమంది అని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏలుతుంది మాత్రం మొత్తం స్టార్ హీరోల వారసులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫ్యామిలీ లా నుండే హీరోలు పరిచయం అవుతుండటం చూస్తున్నాం. ఇది ఒక తెలుగు ఇండస్ట్రీ నే కాకుండా తమిళ, కన్నడ, మలయాళంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇలా చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్లు వారి యొక్క పిల్లలను చిన్నప్పట్నుంచే చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసి చక్కగా ప్లాన్ ను అమలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుత కాలంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిన్నచిన్న సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ మెల్లమెల్లగా స్టార్డమ్ సంపాదిస్తున్న హీరోలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్టు అందుకుంటూ సినీ వారసత్వం ఉన్నవారిని కూడా డీలా చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన డీజే టిల్లు సినిమా బంపర్ హిట్ సాధించింది. దీని తర్వాత తాజాగా వచ్చిన అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ బాక్సాఫీస్ వద్ద బంపర్ విజయాన్ని అందుకుంది. ఇక నిర్మాతలు కూడా ఈ కుర్ర హీరోలతో సినిమాలు తీయడం కోసం ముందుకు వస్తున్నారు.స్టార్ హీరోల వైపు వారి చూపులు మళ్ళీస్తూ కుర్ర హీరోల వైపే మొగ్గుచూపుతున్నారు. చిన్న హీరోలతో సినిమా చేస్తే ప్లాప్ అయినా సరే పెద్దగా నష్టం ఉండదని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.