Singer Mangli: సింగర్ మంగ్లీ న్యూస్ ఛానల్ ద్వారా తాను పరిచయం అయ్యి తన టాలెంట్ తో అంచలంచలుగా ఎదిగిన సింగర్ మంగ్లీ. భక్తి సాంగ్స్, ఫోల్క్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ అంటూ తేడా లేకుండా పాడిన ప్రతి పాట ప్రజాధారణ పొందుతూ ఉంది. ఇటీవలే వచ్చిన నాగ చైతన్య హీరోగా లవ్ స్ట్రోరి సినిమాల్లో ‘ సారంగ దారియా’ పాట సినిమా విడుదలకి ముందే సూపర్ హిట్ సాధించింది.
రవి తేజ సినిమా ‘క్రాక్’ సినిమాల్లో కూడా పాట పాడి మెప్పించారు మంగ్లీ. ఇక ఏదయినా పండగ వచ్చినా కూడా మంగ్లీ పాట తప్పకుండ ఉంటుంది. ఆమె పాడిన పాటల కి యుట్యూబ్ లో కోట్ల వ్యూస్ సాధించిపెట్టాయి. తెలంగాణాలో సంప్రదాయంగా జరుపుకునే బోనాలకు మంగ్లీ పాట పాడారు. పాటలో ఆమె కనిపించారు. ఈ పాటకు రామస్వామి లిరిక్స్, రాకేష్ వెంకటాపురం మ్యూజిక్ అందించారు. ఈ పాటలోని లిరిక్స్ ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది.
Singer Mangli: అందులోని లిరిక్స్ ‘ చెట్టు కింద కూసున్నవమ్మా, సుట్టం లెక్క మైసమ్మచెట్టు కింద కూసున్నవమ్మా, సుట్టం లెక్క మైసమ్మ’ అనే పాట వివాదాలకు దారి తీసింది. ఈ పాటపైనే రాజకొండ పోలీసులకి బీజేపీ నేతలు కంప్లైంట్ చేసారు, అదేవిధంగా సోషల్ మీడియా నుంచి కూడా ఈ పాటకి సంబంధించి చిత్రాలు, లింకులు డిలీట్ చెయ్యాలని కోరారు. ఆలాగే సింగర్ మంగ్లీ పైన కంప్లైంట్ ఇచ్చారు.