డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నారు.. అంటూ కామెంట్స్ చేసిన నెటిజన్స్ కి సింగర్ సునీత ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా ? పెళ్లి మన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. మన జీవితంలోకి ఒక భాగస్వామి వచ్చి మన కష్టసుఖాలను చూసుకుంటూ సాగిపోతుంది జీవితం.
కాని కొందరి జీవితాల్లో అనుకోని విధంగా తమ భావాల మధ్య వ్యతిరేకత వలనో. మరి వారి ఇరువురి మధ్య ప్రేమ తక్కువై ఏదైనా కావచ్చు మధ్యలోనే తమ జీవిత భాగస్వామి నుంచి విడిపోవాల్సి వస్తుంది. ఎందరో విడిపోయారు కూడా అలాగే ఈ విషయంలో సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. ఇటీవలే సింగర్ సునీతకి రామ్ వేరేపనేని కి పెళ్లి అయిన సంగతి తెలిసిందే..
తరచూ సోషల్ మీడియా లో అభిమానులతో ముచ్చటిస్తూ..వారితో ఎప్పటికప్పుడు తన లైఫ్ లోని సంఘటనలు షేర్ చేసుకుంటూ ఉంటారు సునీత. అయితే కొందరు ఆకతాయిలు తనని మీరు డబ్బుకోసం మాత్రమే వివాహం చేసుకున్నారు.. ఆస్తికోసమే సంపాదన కోసమే అంటూ విమర్శిస్తూ ఉన్నారు..ఆమె ఎప్పటికప్పుడు వారికి ఎదురు సమాధానం ఇస్తున్నప్పటికీ కూడా మళ్ళీ విమర్శలు చేస్తూనే ఉన్నారు.
అయితే ఇటీవలే అభిమానులతో చాట్ సెషన్ నిర్వహించిన ఆమె ‘రామ్ తన ఆస్తుల గురించి వివరాలు ఏవి తనకి తెలియదని..ఇప్పటి దాకా ఎప్పుడు కూడా అడగలేదని అన్నారు.. తనకి లవ్ ప్రొపోజ్ చేసేప్పుడు కూడా నువ్ ఒప్పుకుంటే నేను సంతోషంగా ఫీల్ అవుతా.. ఒప్పుకోకపోయినా కూడా నా జీవితాన్ని ఇక్కడైతే ఆపను.. ముందుకి తీసుకెళ్తా అని చెప్పిన సమాధానం తనకెంతో నచ్చిందని.. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కొందరికే సాధ్యమని ఆమె వివరించారు.