ప్రస్తుతం కొందరు ఒక చిన్న పాటి సక్సెస్ వస్తే చాలు గర్వంతో విర్రవీగుతూ ఉంటారు. తామేదో పైనుంచి దిగివచ్చినట్టు ఫీల్ అయిపోతూ బిల్డ్అప్ ఇస్తుంటారు. కానీ కొందరు ఉంటారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణంతో అందరితో కలిసిపోతూ ఉంటారు. వారు ఎన్నో ఘనతలు సాధిస్తూ ఉంటారు, శిఖరం అంత ఎత్తులో వాళ్ళ స్థాయి ఉంటుంది..
కానీ ఎప్పుడూ కూడా నేల విడిచి సాము చేయరు. మనిషికి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఉండాలి. అలాంటి లక్షణం ఉన్న ఉన్నతమైన వ్యక్తి ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.
ధోని ఏప్పుడు కూడా ఆర్భాటాలకి హాంగులకి పోడు. తన సహచర ఆటగాళ్లతోనైనా, గ్రౌండ్ లో పనిచేసే వ్యక్తులతో అయినా, టీం బస్సు నడిపే డ్రైవర్ తో అయినా, అభిమానులతో అయినా కూడా ఒకే తరహాలో ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకే ధోనిని గోల్డెన్ హార్ట్ అని అంటూ పిలుస్తారు..తాజాగా ధోని ఉత్తరాఖండ్ లోని అల్మరా అనే తన పూర్వీకుల స్వగ్రామానికి వెళ్ళాడు. అక్కడి ప్రజలతో మమేకమై వాళ్లతో కలిసి తిరిగాడు. వారితో కబుర్లు చెబుతూ ఫోటోలు దిగుతూ ఎంతో సరదాగా కనిపించాడు. అక్కడ ధోని ఒక మహిళకు కాళ్లు మొక్కిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది. ఆమె ధోని కుటుంబ సభ్యురాలు అని చెబుతున్నారు. అది చూసి ధోని అభిమానులు ధోని సింప్లిసిటీకి ముద్దులైపోతున్నారు.
పెద్దవాళ్ళని గౌరవించడంలో ధోని తర్వాతే ఎవరైనా అని అంటున్నారు.చాలా ఏళ్ల తర్వాత ధోని రావడంతో అక్కడి గ్రామస్తులు ధోనీకి సాంప్రదాయ పద్ధతితో స్వాగతం పలికారు. అనంతరం ధోని అక్కడున్న ఆలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశాడు. ఈ కార్యక్రమంలో ధోని సతీమణి సాక్షి కూడా పాల్గొంది.అయితే 1970 సంవత్సరంలో ధోని తండ్రి పాన్ సింగ్ ఉద్యోగరీత్యా ఉత్తరాఖండ్ నుండి రాంచీ కి వలస వచ్చాడు. ధోని తమ గ్రామానికి రావడంతో అక్కడ ప్రజల ఆనందానికి అవధులు లేవు. అంతా సందడిగా మారిపోయింది.