కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ గురించి అందరికీ తెలిసిందే. డి ఇమ్మాన్ ఎన్నో సెన్సేషనల్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఆల్ మోస్ట్ కోలీవుడ్ లో ఉన్న అందరి హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించాడు.
ఇమ్మాన్ కంపోజ్ చేసిన సినిమాలో సాంగ్స్ తెలుగులో రీమేక్ అయ్యి ఇక్కడ ప్రేక్షకులను కూడా అలరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
శివ కార్తికేయన్ తెలుగులో అందరికీ సుపరిచితుడే. రెమో, డాన్, వరుణ్ డాక్టర్, శక్తి వంటి హిట్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. శివకేర్తికేయన్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. తన ప్రతి సినిమాని తెలుగులో తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయనపై మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. “ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మంటూ ఉంటే ఆ జన్మలో కూడా తాను శివ కార్తికేయన్ సినిమాలు తాను మ్యూజిక్ కంపోజ్ చేయనంటూ” ఇమ్మాన్ వ్యాఖ్యానించారు.
శివ కార్తికేయన్ చేసింది చిన్న మోసం కాదని క్షమించలేనిది అని అన్నాడు. శివ కార్తికేయన్ తనకు క్షమాపణ కూడా చెప్పాడని, అతను చేసిన మోసం చాలాకాలం తర్వాత తెలిసిందని అన్నాడు.ఒకవైపు ఇమ్మాన్ వ్యాఖ్యలు ఇలా ఉంటే ఇమ్మాన్ మాజీ భార్య మౌనిక కామెంట్లు మరోలా ఉన్నాయి.శివ కార్తికేయన్ చాలా మంచివాడు అని ఆమె చెబుతుంది.
ఇమ్మాన్ మౌనికలు 2020లోనే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఇమ్మాన్ మరో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అంతా హ్యాపీగానే ఉన్న టైంలో ఇమ్మాన్ తన వ్యాఖ్యలతో అగ్గి రాజేశాడు. శివ కార్తికేయన్ చేసిన పనిని బయటికి చెప్పలేనని అది తన పర్సనల్ విషయం అని, తన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చెప్పలేకపోతున్నానని మాట్లాడాడు.
వచ్చే జన్మలో శివ కార్తికేయన్ మళ్లీ హీరోగా చేసిన, అప్పుడు తాను కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న అతని సినిమాలకు మాత్రం పని చేయనని ప్రకటించాడు.ఈ వ్యాఖ్యలపై మౌనిక స్పందిస్తూ …ఇమ్మాన్ ఏది చెప్పిన అది తన పర్సనల్ విషయ అని, కాకపోతే ఆయన చెప్పే విధానం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని అన్నారు. శివ కార్తికేయన్ తమ ఇద్దరి మధ్య రాజీ కుదిరిచ్చేందుకు ప్రయత్నించారని ,తను మా ఫ్యామిలీ ఫ్రెండ్ అవ్వడం వల్ల ఇద్దరం విడిపోకుండా కలిసి ఉండడానికి చాలా ప్రయత్నించాడని చెప్పుకొచ్చింది.
Also Read:మరింత దీన స్థితిలో పావలా శ్యామల..! “చచ్చిపోవడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు..!” అంటూ..?